అప్రమత్తతే ప్రధానం
సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందని, వీటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వన్‌టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. అయ్యన్నపేట ఎస్‌కే డిగ్రీ, పీజీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యార్థులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. మొబైల్ ఫోన్‌లో వచ్చే అనవసర మెసెజ్‌లకు స్పందించవద్దని సూచించారు. అనంతరం డిజిటల్ అరెస్టులపై అవగాహన కల్పించారు. పల్లెల్లో ఉండే నిరక్షరాస్యులను చైతన్య పర్చాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై
ప్రసన్నకుమార్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. – విజయనగరం క్రైమ్
Comments
Please login to add a commentAdd a comment