రాజాం సిటీ: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 17న జాబ్‌మేళా నిర్వహించనున్నామని ప్రిన్సిపాల్ బి.భాస్కరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఏపీఎస్‌ఎస్‌డీసీ, ఐటీఐ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ జాబ్‌మేళాకు 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులైన 18 నుంచి 35 ఏళ్లలోపు నిరుద్యోగ యువతీయువకులు అర్హులని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు 20 నుంచి 50 హెల్త్‌కేర్, హెటిరో డ్రగ్స్ తదితర బహుళజాతి కంపెనీలు హాజరుకానున్నాయని తెలిపారు. ఆసక్తి కలిగిన యువతీయువకులు హెచ్‌టీటీపీ//ఎన్‌ఏఐపీయూఎన్‌వైఏఎం.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్‌సైట్‌లో నమోదుచేసుకుని అడ్మిట్ కార్డుతోపాటు బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్స్ ఒరిజినల్, జిరాక్స్‌తోపాటు ఒక పాస్‌పోర్టు సైజు ఫొటోతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాల కు ఫోన్ 7286042743, 998853335 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment