రాజాం సిటీ: రాజాం పట్టణ నడిబొడ్డున సాయంత్రం 4గంటల సమయంలో చోరీజరగడంతో పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం రాజాం పట్టణంలోని ఈశ్వరనారాయణ కాలనీ రెండోలైన్‌లో అమర సత్యనారాయణకు చెందిన ఇంట్లో జరిగిన చోరీతో ఒక్కసారిగా పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు సత్యనారాయణకు బజారులో కిరాణా దుకాణం ఉంది. దుకాణం వద్ద ఉన్న భార్యను ఇంటికి పంపించేందుకు ఇంటి నుంచి 4 గంటల సమయంలో దుకాణానికి సత్యనారాయణ వెళ్లాడు. ఆమె ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు తెరిచి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూసింది. బీరువా తాళాలు పగలగొట్టి ఉండడంతో పాటు అందులోని బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ రోదిస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర, ఎస్సై వై.రవికిరణ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనలో సుమారు 13 తులాల బంగారం అపహరణకు గురైనట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేసున్నట్లు ఎస్సై వై.రవికిరణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment