పోలమాంబ జాతరలో కానుకల వేలంపాట
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి జాతర వచ్చే ఏడాది జనవరి 27,28,29వతేదీల్లో జరగునుంది. జాతరలో అమ్మవారికి భక్తులు సమర్పించుకోనున్న కానుకలకు శుక్రవారం చదురుగుడిలో ఈవో వి.వి.సూర్యనారాయణ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. జాతరలో భక్తులు సమర్పించుకోనున్న చీరలు, జాకెట్లకు రూ.4,05,000, కొబ్బరిముక్కలకు రూ.5,51,000, తలనీలాలు రూ.3,37,600, అమ్మవారి లామినేషన్ ఫొటోలకు రూ.1,52,000, దీపాలకు రూ.2,21,000 వేలంపాట ద్వారా ఆదాయం వచ్చినట్లు ఈవో సూర్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో వేలంపాట పర్యవేక్షణాధికారి టి.రమేష్, సర్పంచ్ సింహాచలమమ్మ, ఎంపీటీసీ తీళ్ల పోలినాయుడు, గ్రామపెద్దలు, ఆలయ ఆశాదీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment