దీర్ఘకాలిక వ్యాధుల బారిన జనం
● 1,04,729 మందిని సర్వే చేసిన వైద్య సిబ్బంది
● వ్యాధుల బారిన పడిన వారు 25,519 మంది
● 52,180 మందికి వివిధ వ్యాధి లక్షణాలు
● 14,789 మందికి బీపీ
● 10,512 మందికి సుగర్
● 160 మందికి కేన్సర్ నిర్ధారణ
విజయనగరం ఫోర్ట్: మానవుని జీవన శైలిలో మార్పులు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం తదితర కారణాల వల్ల జనం దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. వైద్యసిబ్బంది సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వైద్యసిబ్బంది సర్వేలో బీపీ, సుగర్, కేన్సర్, కుష్ఠు సీఓపీడీ వంటి వ్యాధుల బారిన ప్రజలు పడినట్లు గుర్తించారు. అదేవిధంగా మరి కొంతమంది వివిధ రకాల వ్యాధుల లక్షణాలతో ఉన్నట్లు గుర్తించారు. సర్వేచేసిన వారిలో సగం మందిలో వివిధ రకాల వ్యాధి లక్షణాలు (అనుమానిత) ఉన్నట్లు గుర్తించారు. పూర్వ కాలంలో వ్యాయామం, మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల బలంగా, ఆరోగ్యంగా ఉండేవారు. బీపీ, సుగర్ వంటి వ్యాధులు 50, 60 ఏళ్లు దాటిన వారికి వచ్చేవి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా 20, 30 ఏళ్లకే బీపీ, సుగర్ వ్యాధుల బారిన పడుతున్నారు.
జిల్లా జనాభా15, 35, 657 మంది
జిల్లాలో జనాభా 15, 35, 657 మంది. వారందరినీ వైద్యసిబ్బంది సర్వే చేయనున్నారు. నవంబర్ 14 నుంచి దీర్ఘకాలిక వ్యాధుల సర్వే ప్రారంభమైంది. ఇప్పటి వరకు 1, 04,729 మందిని సర్వే చేశారు. వారిలో 25, 519 మందికి బీపీ, సుగర్, కేన్సర్, సీఓపీడీ, కుష్ఠు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. బీపీ 14,0789 మందికి, సుగర్ 10,512 మందికి ఉన్నట్లు నిర్ధారణ కాగా వ్యాధి లక్షణాలు 52,180 మందికి ఉన్నట్లు సర్వేలో గుర్తించారు.
ఆందోళన
కలిగిస్తున్న అంశం
ప్రజల్లో దీర్ఘకాలిక వ్యాధులు పెరగడం ఆందోళన కల్గిస్తున్న అంశం. బీపీ. సుగర్‌తో పాటు కేన్సర్ వ్యాధి పెరుగుతోంది. అదేవిధంగా లివర్ సంబంధిత వ్యాధిగ్రస్తులు, సీఓపీడీ, కంటి సమస్యలు ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది.
జిల్లాలో సర్వే
దీర్ఘకాలిక వ్యాధులపై ఽజిల్లాలో ఉన్న ప్రజలందరినీ వైద్య సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఇప్పటికే లక్ష మందికి పైగా సర్వే చేశారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్స వెంటనే ప్రారంభించనున్నాం. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తాం.
డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఎన్‌సీబీ పీఓ
Comments
Please login to add a commentAdd a comment