నూతన ఆవిష్కరణలతోనే అభివృద్ధి సాధ్యం
● కేంద్రీయ యూనివర్సటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి
● ఓపెన్ యాక్సెస్ పబ్లిషింగ్‌పై సపోర్టెడ్
వర్క్‌షాప్ ప్రారంభం
విజయనగరం అర్బన్: నూతన ఆవిష్కరణలతోనే ఏ దేశమైనా అభివృద్ధి సాధించగలుగుతుందని ఆ దిశగా కళాశాలలు, యూనివర్సిటీ స్థాయిలో విద్యాబోధన జరగాలని కేంద్రీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి అన్నారు. ఈ మేరకు విజయనగరంలోని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో ఐఐటీ ఢిల్లీ సహకారంతో ఓపెన్ యాక్సెస్ పబ్లిషింగ్ అంశంపై రెండురోజుల పాటు నిర్వహించే ‘ఆర్కిడ్ జీపీఎఫ్–2024’ సపోర్టెడ్ వర్క్‌షాప్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశోధన, అకాడెమియా ఓపెన్ యాక్సెస్ పబ్లిషింగ్ ప్రాధాన్యాన్ని వివరించారు. ఇలాంటి వర్క్ షాప్‌ల ద్వారా పరిశోధకులు తమ పరిశోధనల వ్యాప్తిని విస్తృతం చేయవచ్చని తద్వారా ప్రపంచ సహకారాన్ని, ఆవిష్కరణలను ప్రోత్సహించవచ్చన్నారు. వర్క్‌షాప్‌లో రీసోర్స్ పర్సన్లుగా వ్యవహరించిన ఐఐటీ ఢిల్లీ లైబ్రేరియన్ హెడ్ డాక్టర్ నబీ హాసన్, అసిస్టెంట్ లైబ్రేరియన్ డాక్టర్ మోహిత్ గార్గ్, యునెస్కో పబ్లిసింగ్ ఎథిక్స్, ఓపెన్ యాక్సెస్ మోడల్స్, ఓపెన్ పబ్లిక్ లైసెన్సింగ్, ఓపెన్ యాక్సెస్ పబ్లిషింగ్‌లో నైతిక ప్రమాణాలు, ఓపెన్ పబ్లిషింగ్ ప్లాట్‌ఫామ్‌ల ప్రభావవంతమైన వినియోగం గురించి వివరించారు. ప్రారంభ సెషన్‌లో స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్ డీన్ ప్రొఫెసర్ ఎం.శరత్‌చంద్రబాబు, వర్క్‌షాప్ కోఆర్డినేటర్ డాక్టర్ పరికిపండ్ల శ్రీదేవి, కో–ఆర్డినేటర్ డాక్టర్ డి.నారాయణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్, డాక్టర్ ప్రమఛటర్జీ, కమిటీ సభ్యులు, అధ్యాపకులు హాజరయ్యారు. కార్యక్రమంలో పట్టణానికి సమీపంలో ఉన్న వివిధ కళాశాలలు, ఆంధ్రయూనివర్సిటీ, నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి అధ్యాపకులు, లైబ్రేరియన్స్, పరిశోధనా విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment