క్రికెట్‌లో మన్యం జిల్లా జట్టుకు మూడవ స్థానం
భామిని: దివ్యాంగుల క్రికెట్ పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లా జట్టు మూడవ స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలోని జింక్ మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో 10 క్రికెట్ జట్లు పోటీ పడగా పార్వతీపురం మన్యం జట్టు మూడవ స్థానంలో నిలిచినట్లు జిల్లా జట్టు అధ్యక్షుడు కేవటి శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు.ఫైనల్‌లో గుంటూరు జట్టుపై మన్యం జిల్లా జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 178 పరుగులు సాధించినట్లు పేర్కొన్నారు. విజేతల ఓవర్‌రేట్‌కు పరుగులు లెక్కించి తమ జట్టుకు మూడవ స్థానం ప్రకటించినట్లు తెలిపారు. థర్డ్ ప్రైజ్ అందించి అబినందించారన్నారు.
సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం
సాలూరు: ఆర్టీసీ డిపోలో కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఆర్టీసీ యూనియన్ రీజనల్ సెక్రటరీ సుందరరావు, రెండు యూనియన్‌ల (ఎన్‌ఎమ్‌యు, ఎంప్లాయీస్ యూనియన్) సెక్రటరీలు ఎమ్‌ఎస్ నారాయణ, పి.శేఖర్ తదితరులు స్పష్టంచేశారు. ఆర్టీసీ డీఎం తీరుకు నిరసనగా శుక్రవారం సాలూరు డిపో వద్ద పలువురు కార్మికులతో కలిసి రెండవ రోజు గేట్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిపోల సమస్యలపై రెండు యూనియన్‌ల నాయకులు ఒకటిగా కలిసి మేనేజ్‌మెంట్‌కు లేఖ ఇచ్చినప్పటికీ మేనేజ్‌మెంట్ చర్చలకు పిలవలేదన్నారు. డిపో మేనేజర్ మొండి వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. ఈ మధ్య కాలంలో డిపోకు 12 కొత్త బస్సులు ఇస్తామన్నప్పటికీ, తమకు కొత్త బస్సులు వద్దని డీఎం ఆపివేశారని ఆరోపించారు. అంతేకాకుండా పాత స్క్రాప్ బస్సులతో కేఎంపీఎల్ తీసుకురావాలని, అలా తేలేకపోయిన డ్రైవర్లకు కౌన్సెలింగ్‌లు, పనిష్‌మెంట్లు ఇస్తున్నారని వాపోయారు. ఈ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు డీఎస్‌రావు, పి.సుందరరావు, త్రినాథ్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment