విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
● వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి జగన్‌మోహన్‌రావు
● దోనుబాయి, కుశిమి పీహెచ్‌సీల సందర్శన
సీతంపేట: విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్‌మోహన్‌రావు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీతంపేట మండలంలోని దోనుబాయి, కుశిమి పీహెచ్‌సీలను సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు నమోదు పరిశీలించారు. వైద్యసేవలు అందుతున్న తీరును ఆయా విభాగాల వారీగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. రక్త, మూత్ర పరీక్షల నివేదికలు సకాలంలో తెలియజేస్తున్నారా? లేదా అనేది తేదీలను చూశారు. పరికరాల్లో సాంకేతిక లోపాలు తలెత్తకుండా సక్రమంగా ఉపయోగించి జాగ్రత్తపడాలని సూచిం చారు. సాధారణ ప్రసవాలు నిర్వహించడానికి అవసరమైన వైద్య పరికరాలు, ఇంజక్షన్లు, మౌలిక సదుపాయాల లభ్యతను పరిశీలించారు. పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య మెరుగుపడాలని సూచించారు. కార్యచరణ ఎలా చేస్తున్నారని సూపర్‌వైజర్లను ప్రశ్నించారు. కుక్కకాటు, పాముకాటు వ్యాక్సిన్లను చూశారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా ఉండాలని చెప్పారు. సాయంత్రం, రాత్రి వేళల్లో షిఫ్ట్ డ్యూటీలు, టూర్‌డైరీలు సక్రమంగా ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు సీహెచ్ చాందిని, వి.శివశంకర్ ఆరోగ్య కార్యాలయం డెమో యోగీశ్వరరెడ్డి, జయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment