హ్యాక్‌థాన్ విజేతలుగా జీఎంఆర్ ఐటీ విద్యార్థులు
రాజాం సిటీ: స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2024 విజేతలుగా స్థానిక జీఎంఆర్ ఐటీ విద్యార్థులు నిలిచారని ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 11,12తేదీలలో బెంగళూరులోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆధ్వర్యంలో జరిగాయి. సంస్థలు, రాజ్యాంగం పేరుతో వినూత్న డిజిటల్ పరిష్కారాన్ని అభివృద్ధి చేసే దిశగా తమ విద్యార్థులు పోటీల్లో ప్రదర్శనలు ఇచ్చారని తెలిపారు. ప్రజలకు రాజ్యాంగంపై అవగాహన కల్పించే గేమిఫైడ్ ప్లాట్‌ఫారంగా రూపొందించారని చెప్పారు. ముఖ్యంగా భారతరాజ్యాంగంలోని 5, 6వ భాగాలు సులభతరంగా శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయవర్గంపై ఆధారపడిన భాగాలకు సులభమైన భాషలో, వినోదాత్మక పద్ధతిలో ప్రజలకు వివరించడమే దీని లక్ష్యమన్నారు. వినూ త్న ఆలోచనతో రూపొందించిన ప్రాజెక్టును హ్యాకథాన్ జ్యూరీ సభ్యులు విజేతగా ఎంపిక చేసి నగదు బహుమతితోపాటు ట్రోఫీ అందజేశారని తెలియజేశారు. టీమ్‌లోని విద్యార్థులు బి.మౌర్య, వి. తేజవ ర్షిత్, ఎ.ప్రవల్లిక, బి.సుప్రజ, ఎం.విజయ్, సీహెచ్ జగదీష్‌లను ప్రిన్సిపాల్‌తోపాటు డాక్టర్ జె.గిరీష్, అధ్యాపకులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment