సమాజ సృష్టికి జీవం సీ్త్ర
విజయనగరం అర్బన్: సమాజ నిర్మాత, సృష్టికి జీవం సీ్త్ర అని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ విజయభారతి అన్నారు. సీవా భారతి, జాతీయ మానవ హక్కుల కమిషన్ సంయుక్తంగా శ్రీకాకుళంలో నిర్వహించిన సదస్సులో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం ప్రాంత సేవాభారతి జాయింట్ సెక్రటరీ, మహిళా ప్రముఖ్ గుండ్రెడ్డి సంయుక్త నిర్వహణలో సదస్సు జరిగింది. సమావేశంలో విజయభారతి మాట్లాడుతూ మహిళలు అత్యంత శక్తిమంతులని, వేద కాలం, స్వాతంత్య్రోద్యమ కాలంలో మహిళలు స్వత్రంత నిర్ణయాలు తీసుకొని వాటి అమలకు గట్టిగా కృషిచేశారన్నారు. అనంతరం కమిషన్ చైర్‌పర్సన్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గురజాడ విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు, డైరెక్టర్ సంయుక్త, కరస్పాండెంట్ రంగారావు, ఏసీటీఓ రాణిమోహన్ తదితరులు పాల్గొన్నారు.
● జాతీయ మానవ హక్కుల కమిషన్
చైర్‌పర్సన్ విజయభారతి
Comments
Please login to add a commentAdd a comment