అన్నదాత ఆక్రందనపై.. నిరసన గళం
● వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో కదం తొక్కిన రైతన్నలు
● కూటమి ప్రభుత్వ రైతువ్యతిరేక
పాలనపై నిరసన
● కలెక్టరేట్ వరకు ర్యాలీ
● రైతు సమస్యలు పరిష్కరించాలంటూ జేసీకి వినతి పత్రం అందజేత
● హామీల అమలుకోసం కూటమి ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధం
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా
అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
రైతులను మోసం చేయడం
చంద్రబాబుకు అలవాటు
రైతులను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. ఎన్నికలకు ముందు హమీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చిన తరువాత వారిని నట్టేట ముంచడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన కొనసాగితే.. నేడు రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్నారు. పంటల బీమా లేదు.. పెట్టుబడి సాయం అందదు. ఎరువులు, విత్తనాల కోసం బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి. చివరికి పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోక దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి. – బొత్స అప్పలనర్సయ్య,
గజపతినగరం మాజీ ఎమ్మెల్యే
రైతులకు ఇచ్చిన హమీలను అమలు చేసి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రైతు సంక్షేమ ప్రదాతగా నమ్మకాన్ని నిలబెట్టుకుంటే.. కూటమి ప్రభుత్వం రూ.20వేలు ఇస్తామని ప్రకటించి నేటికి పైసా కూడా విదల్చకుండా మోసం చేసింది. బడ్జెట్‌లో రైతు సంక్షేమం కోసం కనీస కేటాయింపులు చేయలేదు. ఆరు నెలల పాలనలో ఇచ్చిన హమీల అమల్లో విఫలం కావడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన గళానికి హాజరైన రైతన్నలే సాక్ష్యం.
– డాక్టర్ తలే రాజేష్,
రాజాం నియోజకవర్గ సమన్వయ కర్త
విజయనగరం:
టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో కష్టాల్లో కూరుకుపోయిన అన్నదాతకు అండగా వైఎస్సార్‌సీపీ శుక్రవారం పోరుబాట సాగించింది. రైతులతో కలిసి కదం తొక్కింది. దగాపడిన రైతన్నకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద నిరసన గళం వినిపించింది. ఆరుగాలం శ్రమించి పదిమందికీ పట్టెడన్నం పెట్టే అన్నదాతపై ప్రభుత్వ కర్కశత్వాన్ని నిలదీసింది. రైతన్నకు అండగా నిలవాలని అధికార యంత్రాంగానికి విన్నవించింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు విజయనగరం జిల్లాలో తలపెట్టిన అన్నదాతకు అండగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఏడు నియోజకవర్గాలకు చెందిన రైతాంగం తరలిరాగా.. వారికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిలిచాయి. జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన గళం కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యేలు శఽంబంగి వెంకట చిన అప్పలనాయు డు, బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, రాజాం నియోజకవర్గ సమన్వయకర్త తలే రాజేష్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఇతర నాయకులు పాల్గొన్నా రు. ఆకుపచ్చ కండువాలు ధరించి కూటమి ప్రభు త్వానికి వ్యతిరేకంగా ముద్రించిన ప్లకార్డులతో నగరంలోని కంటోన్మెంట్ మున్సిపల్ పార్క్ నుంచి కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్‌కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని దగా చేస్తున్న తీరుపై మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అధికారమే ధ్యేయంగా హమీలు గుప్పించి నేడు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడాన్ని తూర్పారబట్టారు.
హామీల అమలుకోసం కూటమి ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు వర్రి నర్సింహమూర్తి, కెల్ల శ్రీనివాసరావు, మావుడి శ్రీనివాసరావు, శీర అప్పలనాయుడు, విజయనగరం కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శోభా స్వాతిరాణి, కొప్పల వెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, డీసీసీబీ మాజీ చైర్మన్ వేచలపు చినరామునాయుడు, పార్టీ నాయకురాలు శోభా హైమావతి, వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సంగంరెడ్డి బంగారునాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శెట్టివీరవెంకట రాజేశ్వరరావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్ కుమార్, జెడ్పీటీసీ గార తవుడు, పార్టీ నాయకులు కె.వి.సూర్యనారాయణరాజు, ఎంఎల్‌ఎన్ రాజు, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్‌లు, కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద ప్లకార్లు ప్రదర్శిస్తున్న
నాయకులు, రైతులు
రైతన్నలను మోసం చేశారు..
రైతే దేశానికి వెన్నెముక అని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారు. గత ఆరు నెలలుగా పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. రైతులు పడుతున్న కష్టాలపై కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు నిరసన గళం వినిపించాం. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను కూడగట్టుకుంది. ఖరీఫ్ పూర్తయినా అన్నదాత సుఖీభవ కింద అందిస్తామన్న రూ.20వేలు అందజేయలేదు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉంది. దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది. మొక్కజొన్న, చెరకకు మద్దతు ధర కరువైంది. రైతన్నకు విత్తనాలు, ఎరువులు, యంత్రాలను సమకూర్చి అండగా నిలిచే ఆర్‌బీకేలు (రైతు సేవా కేంద్రాలు) సేవలను నిర్వీర్యం చేస్తోంది. విపత్తుల వేల పరిహారం అందజేయకుండా రైతన్నకు ఆవేదన మిగుల్చుతోంది. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలుచేయాలి. రైతాంగాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వం స్పందిచేవరకు పోరాటం సాగిస్తాం.
– మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
హామీలు అమలుచేయాల్సిందే..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయాల్సిందే. హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడవడం టీడీపీ కూటమి ప్రభుత్వానికి తగదు. రైతన్నను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. గత ప్రభుత్వం అమలుచేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి. ఫెంగల్ తుఫాన్ వర్షాలకు పంట నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాలి. – బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment