అప్రజాస్వామిక విధానాలకు నిరసనగా..ఎన్నికల బహిష్కరణ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చామని చెప్పుకొనే కూటమి ప్రభుత్వం ఆర్నెల్లలోనే సాగునీటి సంఘాల ఎన్నికలంటే భయపడుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ప్రజావ్యతిరేకత సెగ అప్పుడే తగిలిందని, సాగునీటి సంఘాల ఎన్నికల్లో వారి కుప్పిగంతులే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి గండికొడుతూ అధికారులను, పోలీసులను అడ్డంపెట్టుకొని నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచక విధానా లను నిరసనగా ఎన్నికలను బహిష్కరించాలని అధిష్టానం నిర్ణయించినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు. ఎన్నికల బహిష్కరణపై శుక్రవారం సాయంత్రం ‘సాక్షి’తో మజ్జి శ్రీనివాసరావు మాట్లాడారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ సూచనల ప్రకారమే అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో పరిస్థితిని టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లామన్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు పోటీచేస్తున్న చోట్ల నిస్సిగ్గుగా అధికార దుర్వినియోగానికి తెగించారని ఆరోపించారు. అభ్యర్థులు అడిగిన చోట్ల సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఓటింగ్ నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. నిబంధనలను తుంగలోకి తొక్కేసి ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో పాల్గొనడానికి సిద్ధమైన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా దౌర్జన్యాలకు దిగుతున్నారని, హౌస్ అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు.
ప్రజావ్యతిరేకతకు నిదర్శనం...
సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ఆర్నెల్లలోనే ప్రత్యక్ష విధానంలో జరిగే సాగునీటి సంఘాల ఎన్నికలంటే భయపడుతున్నారని, ప్రజావ్యతిరేకతకు ఇది నిదర్శనమని మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా సరే ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తున్నారన్నారు. వాటిని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన మీడియాపైనా దాడులకు తెగించారంటేనే వారి పరిస్థితి అర్థమవుతోందని చెప్పారు. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దని, కూటమి ప్రభుత్వ దాష్టికానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని అధిష్టానం నిర్ణయించిందని వెల్లడించారు.
సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజాస్వామిక స్ఫూర్తికి గండికొట్టేలా అధికార
పార్టీ తీరు
వైఎస్సార్‌సీపీ మద్దతుదారులెవ్వరూ
పోటీచేయకుండా అడ్డుకుంటున్న వైనం
ఎన్‌వోసీలు ఇవ్వకుండా పారిపోతున్న
తీరు బాధాకరం
అధికారంలోకి వచ్చిన ఆర్నెలలకే ప్రత్యక్ష
ఎన్నికలకు భయపడుతున్న కూటమి నేతలు
జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment