మీడియాపై దాడి హేయనీయం
విజయనగరం అర్బన్: వైఎస్సార్ జిల్లా వేముల మండల కేంద్రంలో నీటిసంఘాల ఎన్నికల ప్రక్రియను కవరేజ్‌కు వెళ్లిన సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీనివాసులు, కెమెరామెన్ రాము, రిపోర్టర్ రాజారెడ్డిలపై రాళ్లతో దాడి చేయడాన్ని జర్నలిస్టులు ఖండించారు. విజయనగరం కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆందోళన చేశారు. కవరేజ్‌లో ఉన్న రిపోర్టర్లపై దాడి చేయడం, కెమెరా, 4జీ లైవ్ కిట్ ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు పీవీఎస్‌ప్రసాద్, అల్లు సూరిబాబు, అల్లు యుగంధర్, వర్రి జగన్నాథవెంకట్, ఎం.ఎల్.ఎన్.నాయుడు, వై.ఎస్.పంతులు, కొల్లూరి శర్మ, గొర్లె సూరిబాబు, బీజీఆర్ పాత్రో, టి.శ్రీధర్, రాజేష్, డేవిడ్ రాజు, రవికుమార్, రాజేంద్రప్రసాద్, ఫొటో జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఖండించిన జర్నలిస్టు సంఘాలు
కలెక్టరేట్ ఎదుట నిరసన
Comments
Please login to add a commentAdd a comment