సమస్యల్లోకి జనం
టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు సమస్యల్లో చిక్కుకున్నారు. సూపర్ సిక్స్ అంటూ జనానికి మోసం ఫిక్స్ చేశారు. ఖరీఫ్ సీజన్ ముగిసినా రైతన్నకు పెట్టుబడి సాయం అందలేదు. ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయలేదు. ధాన్యం అమ్ముకునేందుకు నేడు రైతులు అష్టకష్టాలుపడాల్సి వస్తోంది. ఆరునెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేసేవరకు ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం సాగిస్తుంది. గత ప్రభుత్వం వైఎస్సార్ భరోసా కింద రూ.12,500 ఇస్తామని ప్రకటించి ఏటా ఠంచన్‌గా రైతన్న ఖాతాలకు రూ.13,500 జమచేసింది.
– శంబంగి వెంకటచిన అప్పలనాయుడు,
బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment