గంజాయితో విలవిల
● సైబర్ వల..
● పెచ్చుమీరిన సైబర్ నేరాలు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది 107 కేసులు నమోదయ్యాయి. జిల్లా పోలీస్‌శాఖ అప్రమత్తతతో రూ.88,32,301లను ఫ్రీజ్‌చేసి బాధితులకు న్యాయస్థానం అనుమతులతో అందజేసింది.
● రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వారిపై 169 కేసులు నమోదు చేశారు.
● మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు సంబందించి ఒకటి, ఆత్మహత్యకు ప్రేరేపించే కేసులు మూడు నమోదైనట్టు ఎస్పీ వెల్లడించారు. వరకట్న వేధింపులు 235 కేసులు, పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కేసులు 18, కిడ్నాప్ కేసులు రెండు, మహిళల గౌరవానికి భంగం కలిగించే విషయమై 89 కేసులు నమోదయ్యాయి.
● హత్య, హత్యాయత్నం కేసులు స్వల్పంగా పెరిగాయి. గతేడాది 16 కేసులు నమోదుకాగా ఈ ఏడాది 17 నమోదయ్యాయి. కొట్లాట కేసులు 351, గ్రీవియస్ హర్ట్ కేసులు 27, కిడ్నాప్ కేసులు ఆరు నమోదయ్యాయి.
● ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఈ ఏడాది 63 నమోదయ్యాయి. వైట్‌కాలర్ నేరాలు 168 చోటుచేసుకున్నాయి. 360 మిస్సింగ్ కేసుల్లో 307 మందిని ట్రేస్ చేసి పోలీసులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 7,129 దర్యాప్తులో ఉన్న కేసుల్లో ప్రస్తుతం 2,088 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల జరిగిన లోక్ అదాలత్‌లో ఐదువేల పైబడి కేసుల రాజీ కుదర్చడంలో జిల్లా పోలీస్ శాఖను ప్రశంసిస్తూ ఎస్పీ వకుల్‌జిందల్‌కు డీజీపీ ప్రశంసాపత్రం, నగదు రివార్డులను అందజేశారు.
● పెచ్చుమీరిన సైబర్ నేరాలు..
భారీగా రికవరీ
● పెరిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులు
● గంజాయిపై పోలీస్ నిఘా
● పోక్సో కేసుల్లో నిందితులకు
త్వరితగతిన శిక్షపడేలా కృషి
● హైవేలపై నెత్తుటి మరకలు
● మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీస్ ‘సంకల్పం’
● వార్షిక ప్రగతిని వివరించిన ఎస్పీ వకుల్ జిందల్
● రాజాంలో నేరాల జోరు
రాజాం నియోజకవర్గంలో గతంలో కంటే 2024 ఏడాదిలో క్రైమ్ రేటు పెరిగింది. రాజాం పట్టణంతో పాటు మండలంలో 95 కేసులు నమోదుకాగా, ఇందులో ఎనిమిది మరణాల కేసులు నమోదయ్యాయి. 40 ప్రమాదాల కేసులు, 39 రోడ్డు ప్రమాదాల కేసులు, 8 దొంగతనాల కేసులు ఉన్నాయి. రేగిడి మండలంలో 143 కేసులు నమోదుకాగా, ఇందులో 6 కేసులు మరణాలకు సంబంధించినవి. శిర్లాం గ్రామంలో మే నెలలో జరిగిన ఉత్తరావెల్లి సంగాం హత్య కేసు సంచలనంగా మారింది. ఇప్పటికీ ఈ కేసు కొలిక్కిరాలేదు. సంతకవిటి మండలంలో 157 కేసులు నమోదుకాగా, ఇందులో హత్య కేసు నమోదైంది. ఇది మండలంలో కేఆర్ పురంలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదంలో కాయల యల్లమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. జీఎంఆర్‌ఐటీ సమీపంలో నాలుగు నెలలు కిందట జరిగిన గంజాయి బ్యాచ్ దాడికేసు ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. వంగర మండలంలో 2024 ఏడాదిలో 117 కేసులు నమోదుకాగా, ఇందులో ఐదు కేసులు మరణాలకు సంబంధించి ఉన్నాయి.
సాక్షిప్రతినిధి, విజయనగరం: ఉరుకుల, పరుగుల జీవితాల్లో మనిషి చిన్నపాటి తప్పిదాలకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఓ వైపు.. మాదక ద్రవ్యాలకు బానిసలై ప్రాణాలు కోల్పోతున్న వారు మరోవైపు.. మైనర్లకు వాహనాలిచ్చి రోడ్లపైకి వదిలేయడంతో జోరందుకున్న ప్రమాదాలు.. ఛిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు... సాంకేతిక పరిజ్ఞానంతో అమాయకుల బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్న సైబర్ మోసగాళ్లు.. ఇలా.. 2024లో జరిగిన నేరాలు ఘోరాలు వందలాది కుటుంబాల్లో విషాదాన్ని, శోకాన్ని మిగిల్చాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చేపట్టే చర్యలను, నేరాల చిట్టాను జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ వకుల్‌జిందల్ వివరించారు. 2025లో నేరాల తగ్గుముఖం పట్టేలా పోలీస్‌శాఖ కృషిచేస్తుందని వెల్లడించారు. ఈ ఏడాది నేరాల నివేదికను ఓ సారి గమనిస్తే..
● అనుమానాస్పాద స్థితిలో విద్యార్థి మృతి
విజయనగరం కాటవీధి బీసీ హాస్టల్‌లో ఏడోతరగతి విద్యార్థి కొణతాల శ్యామలరావు (12) అనుమానాస్పద స్థితిలో నవంబర్ 3న మరణించాడు. విద్యార్థిది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని చిల్లపేట రాజాం గ్రామం. ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత మంచినీళ్లు తాగి బట్టలు ఉతకడానికి రూమ్ నుంచి వెళ్తున్న సమయంలో కళ్లుతిరిగి స్పహ తప్పి నేలకు ఒరిగిపోయాడు. హాస్టల్ వార్డెన్ వెంటనే సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే మృతిచెందాడు.
● 81 గంజాయి కేసుల నమోదు
గంజాయి అక్రమ రవాణాదారులపై ఈ ఏడాది 81 కేసులు నమోదుచేసి 247 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
వీరి నుంచి 2152.139 కిలోల గంజాయిని, 78 గ్రాముల నల్లమందును, 29 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన గంజాయి విలువ రూ. కోటీ 2 లక్షల 30వేల 415 ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. గంజాయి కేసుల్లో అక్రమ రవాణాకు ప్రధాన కారకులైన నిందితులను అరెస్టు చేస్తున్నామని, లింకులను ఛేదిస్తున్నట్లు ఎస్పీ జిందల్ తెలిపారు.
● ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులు
ఎన్‌పోర్స్‌మెంట్ కేసుల విషయంలో ఈ ఏడాది 98,619 ఈ చలానాలు విధించారు. హెల్మెట్ ధరించని వారిపై 65,350 కేసులు, మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై 3,420 కేసులు, ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిపై 2,570 కేసులు, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేసినవారిపై 529 కేసులు, అస్తవ్యస్థమైన నంబర్ ప్లేట్స్ ఉన్న వాహనాలపై 3,678 కేసులు నమోదుచేశారు
● ప్రజల నుంచి స్వీకరించిన 1907 ఫిర్యాదుల్లో 1667 పరిష్కరించామని ఎస్పీ తెలిపారు. 240 వరకు పెండింగ్‌లో ఉన్నాయి.
● సంకల్పం కార్యక్రమంలో 1592 ప్రాంతాల్లో ప్రజలు, విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరుతూ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
● టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండి రాజీవ్ అలియాస్ డాడీ అనే వ్యక్తిపై పీడీయాక్ట్ నమోదుచేసి, నేరాలను , నేరస్టులను కట్టడి చేశారు.
● యావత్ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 60 సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి, స్టేషన్‌లోనే కమాండ్ కంట్రోల్ ప్రారంభించడం విశేషం.
● వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన డిజిటల్ అరెస్ట్ కేసులో బాధితులు ఆన్‌లైన్ ద్వారా పోగొట్టుకున్న రూ.40 లక్షల 11వేల నగదును 31 బ్యాంకు ఖాతాలకు బదిలీచేసిన నిందితులను అదుపులోకి తీసుకుని బదిలీ చేసిన రూ. 22,19,330 నగదును ఫ్రీజ్ చేయగలిగారు.
● వన్‌టన్ పరిధిలో కేవలం 4 గంటల వ్యవధిలో కిడ్నాప్ కేసును ఛేదించి కోరాడ సుశీల అనే మహిళను అరెస్టు చేసి బాబును తల్లిదండ్రులకు అప్పగించారు.
● ఎస్.కోట పరిధిలో కొట్టాం గ్రామంలో సూర్యనారాయణరాజు అనే వ్యక్తి కిడ్నాప్‌కు గురికాగా, కిడ్నాప్‌కు పాల్పడిన నలుగురు నిందితులను ఐదు గంటల వ్యవధిలో అరెస్టు చేసి, కేసు మిస్టరీని ఛేదించారు.
● విస్తృత దాడులు
ఎకై ్సజ్ కేసులకు సంబంధించి ఈ ఏడాది 1327 కేసులు నమోదుచేసి, 1369 మందిని అరెస్టు చేశారు. 6349.12 లీటర్ల మద్యాన్ని, 163 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. పేకాట ఆడుతున్న వారిపై 1070 కేసులు నమోదుచేసి, 2002 మందిని అరెస్టు చేసి, రూ. 84లక్షల 64వేల 225 నగదు సీజ్ చేశారు. కోడిపందాలు నిర్వహిస్తున్న వారిపై 262 కేసులు నమోదుచేసి, 402 మందిని అరెస్టు చేసి, వారి నుంచి 191 కోడిపుంజులు, రూ.4లక్షల25వేల 656 నగదు సీజ్ చేశారు.
● పశువులు, ఇసుక అక్రమరవాణా
పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై 70 కేసులు నమోదుచేసి, 104 మందిని అరెస్టు చేసి, 1287 పశువులను, 73 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఇసుక అక్రమరవాణాకు పాల్పడుతున్న వారిపై 67 కేసులు నమోదుచేసి, 219 మందిని అరెస్టు చేసి, 1024 టన్నులు ఇసుకను, 172 వాహనాలను సీజ్ చేశారు.
విషాదం మిగిల్చిన రోడ్డు ప్రమాదాలు
భోగాపురం మండలం పోలిపల్లి జాతీయరహదారిపై నవంబర్ 30వ తేదీన జరిగిన కారు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన దబిడి కౌశిక్ రెడ్డి (27), అతని స్నేహితుడు వడ్డే అభినవ్ (27), అభినవ్ భార్య మణిమాల (24), డ్రైవర్ జయేష్ (27) అక్కడకక్కడే మృతి చెందారు.
భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలో జాతీయరహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు బలంగా డీకొనడంతో తమిళనాడు రాష్ట్రం చైన్నె మీనంబకానికి చెందిన నాగిరెడ్డి యాదుకుమార్(82), అతని భార్య సాయిలీల (74) అక్కడకక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరుకు తీవ్రగాయాలయ్యాయి.
భోగాపురం మండలం నారుపేట వద్ద నవంబర్ 9వ తేదీన జరిగిన ప్రమాదంలో ముందు వెళ్తున్న లారీని వ్యాను బలంగా ఢీకొనడంతో వ్యాన్‌లో మంటలు చెలరేగడంతో షేక్ అరీఫ్ (50) మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యాడు. మరో డైవర్ తీవ్రగాయాలతో బయటపడ్డారు.
బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రపురం మండలం కొండకెంగువ పంచాయతీలోని జీలిక వలసలో ఈ ఏడాది జూలై 14న దారుణం చోటుచేసుకుంది. ఉయ్యాలలో ఉన్న ఆరు నెలల చిన్నారిపై తాతయ్య వరసయ్యే వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment