ఫలించిన భోగాపురం ఎంపీపీ పోరాటం
పూసపాటిరేగ: స్థానిక సంస్థలకు మంజూరు చేయాల్సిన భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
స్టాంప్ డ్యూటీ నిధులు ఎట్టకేలకు విడుదలయ్యా యి. 2022 సంవత్సరం నుంచి భోగాపురం రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి స్టాంప్‌డ్యూటీ నిధులు పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాలకు విడుదల కావాల్సి ఉంది. దీనిపై భోగాపురం ఎంపీపీ ఉప్పాడ అనూషరెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు ఫిర్యాదుచేశారు. భూరిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన డబ్బుల్లో 5 శాతం నిధులు స్థానిక సంస్థలకు విడుదల చేయాలని కోరారు. దీనిపై జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు స్పందించి నిధులు విడుదల చేశారు. 2022లో ఏడు నెలల కాలానికి భోగాపురం రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో స్టాంప్‌డ్యూటీ కింద 4.73 కోట్లు విడుదల చేశారు. జిల్లా పరిషత్‌కు రూ.90 లక్షలు, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండల పరిషత్‌లకు రూ.90 లక్షలు, ఆయా పంచాయతీల పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రాప్తికి రూ.2.93 కోట్లు విడుదలయ్యాయి. ఇవి స్థానిక సంస్థల పరిధిలో అభివృద్ధి పనులకు ఉపయోగపడతా యని, ఎంపీపీ అనూషరెడ్డి, వైఎస్సార్‌సీపీ భోగాపురం మండల అధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి కృషిని పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.
స్థానిక సంస్థలకు స్టాంప్‌డ్యూటీ నిధులు విడుదల
ఏడు నెలలకు రూ.4.73 కోట్లు రిలీజ్
Comments
Please login to add a commentAdd a comment