రచ్చబండలపై పెద్దల ముచ్చట
వీరంతా జీవనయానంలో ఎన్నో యాత్రలు చేసినవారు. కష్టసుఖాలను దాటుకుని.. పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన పెద్దలు. వీరికి సెల్‌ఫోన్ అంతగా తెలియదు. కంప్యూటర్ వాడలేదు. ఐనాక్స్‌కు వెళ్లలేదు. పుట్టిన దగ్గర నుంచి పల్లె వాతావరణంలోనే ఆనందకర, ఆరోగ్యకర జీవనం సాగించిన పెద్ద మనుషులు. పంటల సాగులో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడిన అసలుసిసలైన పల్లె మొనగాళ్లు. పల్లెలకు వెళ్లే ప్రతి ఒక్కరికీ రచ్చబండలపై ఇలాంటి తరం కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ మాటామంతీ చెప్పుకుంటూ.. నవ్వులు చిందిస్తూ.. ఊరి బాగుకోసం ఆలోచిస్తూ.. మంచి చెడులు తర్కిస్తూ.. నివసిస్తున్న ఈ పెద్దరికం మనందరికీ ఆదర్శనీయం. వారి అడుగుజాడలు అనుసరణీయం. ప్రస్తుత సాంకేతిక యుగంలో సెల్‌ఫోన్ చేతిలో లేకుండా గడిపే ఇలాంటి తరం మనకు మళ్లీ కనిపించదు. గుంకలాం, బియ్యాలపేట గ్రామాల్లో రచ్చబండలపై కూర్చొని నవ్వులు చిందిస్తున్న వృద్ధులను ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. – విజయనగరం రూరల్
Comments
Please login to add a commentAdd a comment