ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఎయిర్ ప్యాకేజీలు
విజయనగరం టౌన్: యాత్రికుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రత్యేక ఎయిర్ ప్యాకేజీలను ప్రారంభించిందని విశాఖ ఏరియా అధికారి ఎ.నిరంజన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సుందరమైన కేరళ ట్రిప్‌తో పాటూ మేజికల్ మేఘాలయ ట్రిప్‌లను ప్రత్యేక ఆఫర్‌లో అందజేస్తున్నామన్నారు. కేరళ ట్రిప్‌లో కొచ్చి, మన్నార్, త్రివేండ్రం, తేక్కడి, కుమరకోమ్ తదితర ప్రాంతాలు కవర్ చేస్తామని పేర్కొన్నారు. జనవరి 24 నుంచి 30 వరకు ట్రిప్ ఉంటుందన్నారు. మేజికల్ మేఘాలయ ప్యాకేజీలో గౌహతి, చిరపుంజి, మావ్లిన్నాంగ్, కజిరంగ నేషనల్ పార్క్ తదితర ప్రాంతాలకు తీసుకెళ్తామన్నారు. ఫిబ్రవరి 12 నుంచి 18 వరకూ ఈ ట్రిప్ ఉంటుందన్నారు. అన్నిరకాల వసతి, సౌకర్యాలతో ప్యాకేజీ రూపకల్పన జరిగిందని, విహారయాత్రికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు సెల్: 92810 30748, లేదంటే విశాఖ రైల్వేస్టేషన్, ఐఆర్‌సీటీసీ ప్రధాన ప్రవేశద్వారం, గేట్ నంబర్–1లో సంప్రదించాలని కోరారు.
కొమరాడ విద్యార్థికి
కిక్ బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్
కొమరాడ: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫస్టియర్ ఎంపీసీ చదువుతున్న తెంటు హేమంత్ కిక్ బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించాడు. గతేడాది డిసెంబర్ 21వ తేదీన హౌరాలో జరిగిన ఇంటర్నేషనల్ కిక్ బిక్సింగ్ 48 కిలోల విభాగంలో దేశం తరఫున తలపడి విజేతలగా నిలిచినట్టు పిన్సిపాల్ నాగేశ్వరరావు తెలిపారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు కళాశాల ఆవరణలో హేమంత్ ను గురువారం సత్కరించారు. క్రీడల్లో రాణించేవారికి ఉజ్వల భవిత ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు.
టెండర్ వాయిదా
పార్వతీపురం: గిరిజన సహకారసంస్థ కిరాణా టెండర్‌కు సంబంఽధించి ఈనెల 4న నిర్వహించాల్సిన టెండర్ అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు జీసీసీ డివిజనల్ మేనేజర్ వి.మహేంద్రకుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తదుపరి టెండర్‌ను ఎప్పుడు నిర్వహించేది జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటన ద్వారా తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment