డీఎంహెచ్‌ఓగా బాధ్యతల స్వీకరణ
విజయనగరం ఫోర్ట్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌ఓ)గా డాక్టర్ జీవనరాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. వైద్యారోగ్యశాఖ కార్యాలయం సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. విశాఖపట్నంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిగా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై ఆమె ఇక్కడకు బదిలీ అయ్యారు. ఇక్కడ డీఎంహెచ్‌ఓగా పనిచేసిన ఎస్. భాస్కరరావుకు పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ అయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అధిక వడ్డీతో డిపాజిట్ల స్వీకరణ
● డీసీసీబీ సీఈఓ ఉమామహేశ్వరరావు
విజయనగరం అర్బన్: జాతీయ, వాణిజ్య బ్యాంకుల కంటే అధిక వడ్డీతో డిపాజిట్‌లు స్వీకరిస్తున్నట్టు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) సీఈఓ సీహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. సీఈఓగా పూర్తి బాధ్యతలు స్వీకరించిన ఆయన స్థానిక బ్యాంకు కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం డీసీసీబీ 2,100 కోట్ల వ్యాపార లాదేవీలు సాగిస్తోందన్నారు. రుణాల రూపంలో రూ.1,800 కోట్ల వరకు టర్నోవర్ అవుతున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ శాఖల నుంచి డిపాజిట్‌ల సహకారాన్ని కోరుతున్నామని, రుణ బకాయిల వసూళ్లను 4.5 నుంచి 3 శాతానికి తగ్గించే లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు.
దేశ సమగ్రత, మత సామరస్యంపై ప్రచారం
విజయనగరం పూల్‌బాగ్: దేశ సమగ్రత, మత సామరస్యం పెంపొందించేలా సీపీఎం ఆధ్వర్యంలో నేటి నుంచి వారం రోజుల పాటు ప్రచార కార్యక్రమం సాగనుందని పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు. ప్రజలందరూ దేశ సమగ్రత, మత సామరస్యం, లౌకిక తత్వాన్ని పెంపొందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. స్థానిక ఎల్బీజీ భవనంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతసామరస్యానికి, లౌకిక తత్వానికి పెను ప్రమాదం ఏర్పడిందన్నారు. అన్ని మతాలవారు కలిసిమెలసి జీవించే దేశంలో మతోన్మాద చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో మతోన్మాదం పెరుగుతోందని, దీనికి కూటమిలో భాగమైన టీడీపీ, జనసేన ఊతమిస్తున్నాయని ఆరోపించారు. మతం అనేది ప్రతి మనిషి వ్యక్తిగతమని, ఎవరికి నచ్చిన మతాన్ని వారు ఆచరించడంలో తప్పులేదన్నారు. మతసామరస్యాన్ని పెంపొందించేలా సీపీఎం తలపెట్టిన ప్రచార కార్యక్రమానికి జిల్లావాసులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు వి.లక్ష్మి, రెడ్డి శంకరరావు, టీవీ రమణ పాల్గొన్నారు.
సుంకి పరిసరాల్లో
ఏనుగుల గుంపు
గరుగుబిల్లి: మండలంలోని సుంకి పరిసరాల్లో ఏడు ఏనుగుల గుంపు గురువారం సంచరించింది. ప్రధాన రహదారికి సమీపంలో సంచరిస్తుండడంతో రాకపోకలకు ప్రజలు హడలిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
డీఎంహెచ్‌ఓకు అభినందనలు తెలియజేస్తున్న
కార్యాలయ సూపరింటెండెంట్ నాగరాజు, తదితరులు
Comments
Please login to add a commentAdd a comment