● నెమ్మదించిన మెడికల్ కాలేజీ రెండో దశ పనులు
ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ గత జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గాజులరేగ సమీపంలోని 70 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఆధునిక దేవాలయంలా రూపుదిద్దుకుంటోంది. తొలి దశ పనులు శరవేగంగా పూర్తిచేసి ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ తరగతులతో కళాశాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఇటీవలే సెకండ్ ఇయర్ తరగతులు కూడా మొదలయ్యాయి. రెండో దశ పనులు శరవేగంగా పూర్తి చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు బాగా నెమ్మదించాయి. 2025 సంవత్సరంలోనైనా పూర్తిచేస్తే వైద్య విద్యార్థుల కష్టాలు తీరుతాయి.
విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల
Comments
Please login to add a commentAdd a comment