అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని మంగళ, బుధవారాల్లో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమా చక్రవర్తి కుటుంబసమేతంగా ఆదిత్యున్ని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, సిబ్బంది గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం వేదాశీర్వచనాన్ని, తీర్ధప్రసాదాలను అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ కనకరాజు జ్ఞాపిక అందజేశారు. అదే విధంగా, విలక్షణ సినీ నటుడు సాయికుమార్, జబర్దస్ట్ హాస్య నటుల బృందం అప్పారావు తదితరులు కూడా ఆదిత్యున్ని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment