పురం.. సమస్యలు యథాతథం !
● ఈ నెల 26తో ముగియనున్న
కౌన్సిల్ పాలన
● వనపర్తి, పెబ్బేరు, అమరచింతలో అసంపూర్తిగా
రహదారి విస్తరణ పనులు
● డ్రెయినేజీలు, రోడ్ల విస్తరణకు నోచుకోని కొత్తకోట
వనపర్తి టౌన్: జిల్లాలోని ఐదు పురపాలికల పాలకవర్గాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. 2020, జనవరి 27న కొలువుదీరిన పాలక వర్గాలు ఈ ఏడాది జనవరి 26తో ఐదేళ్లు పూర్తి చేసుకోనున్నాయి. గత ఎన్నికల సమయంలోనే కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత పురపాలికలుగా ఏర్పడ్డాయి. జిల్లాలోని అన్ని పురపాలికల్లో 80 మంది కౌన్సిలర్లు, 15 వరకు కో–ఆప్షన్ సభ్యులు ఉన్నారు. జిల్లాకేంద్రంలోని పురపాలికను 2020లో బీఆర్‌ఎస్ కై వసం చేసుకోగా.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సొంత పార్టీలో చీలిక రావడంతో 9 నెలల కిందట అనూహ్యంగా కాంగ్రెస్‌పార్టీ హస్తగతం చేసుకుంది. చైర్మన్‌గా్ మహేష్, వైస్ చైర్మన్‌గా పాకనాటి కృష్ణ ఎన్నిక కాగా.. వీరి హయాంలో ఇటీవల రూ.135 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.4 లక్షలలోపు ఉన్న చికెన్ వేస్టేజ్ టెండర్ ఈ ఏడాది రూ.20 లక్షల పైచిలుకుకు చేరుకుంది. కాగా అసంపూర్తిగా ఉన్న రహదారి విస్తరణ పనులు, హరిత మొక్కల సంరక్షణలో విఫలమ య్యారనే ఆరోపణ లు ఉన్నాయి. రెండునెలల కిందట పుర కమిషనర్ పూ ర్ణచందర్‌ను సరెండర్ చేస్తూ కౌన్సిల్‌లో తీర్మానం చేసి నా, కలెక్టర్, సీడీఎంఏకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదు. ఈ దశలోనే అధికారులు, కౌన్సిల్‌కు మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత మున్సిపాలిటీల్లో ప్రారంభంలో కొలువుదీరిన పాలకవర్గాలే కొనసాగుతున్నాయి. పెబ్బేరులో రహదారి విస్తరణ, విద్యుత్ స్తంభాలు సరిజేసే పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కొత్తకోటలో కర్నూలు–హైదరాబాద్ రహదారి విస్తరణ పనులు ఆశించిన రీతిలో కొనసాగకపోవడంతో పట్టణ వాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు విస్తరణ జరిగిన ప్రాంతాల్లో డ్రెయినేజీ నిర్మా ణాలను పూర్తిగా వదిలేశారు. వనపర్తి–ఆత్మకూర్ రోడ్డు విస్తరణ ఊసెత్తకపోవడంతో భారీ వాహనాల రాకపోకలతో చిరు వ్యాపారులు, ద్విచక్రవాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమరచింతలో విస్తరణ పనులు అరకొరగానే పూర్తి చేశారు. ఆత్మకూరులో డివిజన్ ఏర్పాటు, చెరువు కట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చే ప్రక్రియపై కౌన్సిల్ దృష్టి సారించడం లేదు.
పురపాలికల వారీగా ఇలా..
అసంపూర్తి పనులు..
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పురపాలన సాగడం లేదు. రోడ్ల విస్తరణ పనుల్లో ముందుచూపు లేకపోవడంతో డ్రెయినేజీ నిర్మాణాలు మరిచి, ప్రయాణికులకు ఇబ్బంది కలిగే రీతిలో డివైడర్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కొత్తకోట–ఆత్మకూర్ రోడ్డు విస్తరణపై కౌన్సిల్‌లో తీర్మానం అంశాన్ని మరుగున పడేశారు. – వేముల సుధాకర్‌రెడ్డి,
గణేష్‌నగర్‌కాలనీ, కొత్తకోట
పారదర్శక పాలన..
కొలువుదీరిన నాటి నుంచి ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నా. కొళాయి బిల్లుల మొండి బకాయిల వసూళ్లలో కదలిక తీసుకొచ్చాం. అన్ని వార్డులకు ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించాం. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా నిధులు దుర్వినియోగం చేసింది. వాటిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకున్నాం. – మహేష్, పుర చైర్మన్, వనపర్తి
Comments
Please login to add a commentAdd a comment