జాగ్రత్తగా సమాచారాన్ని సేకరించాలి | - | Sakshi
Sakshi News home page

జాగ్రత్తగా సమాచారాన్ని సేకరించాలి

Published Sat, Nov 16 2024 8:36 AM | Last Updated on Sat, Nov 16 2024 8:36 AM

జాగ్ర

జాగ్రత్తగా సమాచారాన్ని సేకరించాలి

చెన్నారావుపేట: తప్పులు లేకుండా సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తులను నింపాలని జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సీపీఓ గోవిందరాజన్‌ సూచించారు. ఈ మేరకు మండల కేంద్రంలో జరుగుతున్న ఇంటింటి కులగణన సర్వేను శుక్రవారం వారు పరిశీలించి మాట్లాడారు. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు. జాగ్రత్తగా సమాచారం సేకరించి ప్రజల సహకారంతో సర్వేను విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట మండల స్పెషల్‌ ఆఫీసర్‌ బాలకృష్ణ, ఎంపీడీఓ నల్లా శ్రీవాణి, ఎంపీఓ శ్రీధర్‌రాజు, ఎన్యుమరేటర్లు అనిల్‌, శౌరయ్య, సిబ్బంది ఉన్నారు.

తిమ్మంపేటలో చైన్‌స్నాచింగ్‌

దుగ్గొండి: మండలంలోని తిమ్మంపేటలో శుక్రవారం చైన్‌స్నాచింగ్‌ జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధురాలు పాలడుగుల మల్లమ్మ నర్సంపేటకు వెళ్లి సాయంత్రం లక్నెపల్లి వద్ద బస్సు దిగింది. అనంతరం తిమ్మంపేటకు నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెంబడించారు. ఆమె మెడలోని రూ.రెండు లక్షల విలువగల రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. సంఘటనా స్థలాన్ని నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్‌, సీఐ సాయిరమణ సందర్శించారు. ఇదిలా ఉండగా గిర్నిబావిలో గురువారం ఓ మహిళ నుంచి 8 తులాల బంగారు ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లినట్లు తెలిసింది. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. వరుస దొంగతనాలతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్‌ పెంచి చోరీలను అరికట్టాలని వారు కోరుతున్నారు.

అభివృద్ధి బాటలో

రైల్వే ఈసీసీఎస్‌

కాజీపేట రూరల్‌: రైల్వే ఎంప్లాయీస్‌ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (ఈసీసీఎస్‌)ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు ఈసీసీఎస్‌ ఎండీ, మజ్దూర్‌ యూనియన్‌ ఏడీఎస్‌ చిలుకు స్వామి అన్నారు. కాజీపేట రైల్వే డీజిల్‌ లోకో షెడ్‌ ఎదుట శుక్రవారం రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ డీజిల్‌ బ్రాంచ్‌ చైర్మన్‌ ఎస్‌కే.జానీ ఆధ్వర్యంలో గేట్‌ మీటింగ్‌ జరిగింది. ఈమీటింగ్‌లో చిలుకు స్వామి మాట్లాడుతూ.. డిసెంబర్‌ 4, 5 తేదీల్లో జరిగే ఎన్నికల్లో జెండా గుర్తుకు ఓటు వేయాలన్నారు. సీసీఎస్‌ సొసైటీలో మజ్దూర్‌ యూనియన్‌ పాలక మండలి ఎనిమిది నెలల్లో రెండు సార్లు డివిడెంట్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రైల్వే కార్మికుల సమస్యల పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం మజ్దూర్‌ యూనియన్‌ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మజ్దూర్‌ యూనియన్‌ డీజిల్‌ బ్రాంచ్‌ సెక్రటరీ పి.వేదప్రకాశ్‌, ట్రెజరర్‌ జి. రాజేశ్వర్‌రావు, అసిస్టెంట్‌ సెక్రటరీ యాదగిరి, నరేశ్‌యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ తిరుపతి, భాస్కర్‌రెడ్డి, వి.యాదగిరి, నాగరాజు, డి.వెంకట్‌, అశోక్‌, సంఘీ శ్రీనివాస్‌, వి.శ్రీనివాస్‌, చేరాలు, శ్రీధర్‌, రవీందర్‌, శంకర్‌, చంద్రమౌళి, నళినికాంత్‌, జానీ, సుబానీ, అజీముద్దీన్‌, అంతయ్య పాల్గొన్నారు.

రేపు ఉమ్మడి జిల్లాస్థాయి చెస్‌ పోటీలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: కమల్‌కింగ్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 17న ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్‌ నిర్వహణ కార్యదర్శి జి.రాంప్రసాద్‌ తెలిపారు. అండర్‌–7, 9, 11, 13, 15 బాలబాలికల విభాగంలో నిర్వహించే పోటీల వాల్‌పోస్టర్లను శుక్రవారం ప్రభుత్వ న్యాయవాది కె.నర్సింహారావు ఆవిష్కరించారు. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించే ఈపోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 16వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని రాంప్రసాద్‌ తెలిపారు. పేర్లు నమోదు, ఇతర వివరాల కోసం 96760 56744 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
జాగ్రత్తగా సమాచారాన్ని సేకరించాలి1
1/2

జాగ్రత్తగా సమాచారాన్ని సేకరించాలి

జాగ్రత్తగా సమాచారాన్ని సేకరించాలి2
2/2

జాగ్రత్తగా సమాచారాన్ని సేకరించాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement