బాధితులకు న్యాయం చేయాలి
గీసుకొండ: కేసులను త్వరితగతిన దర్యాప్తు చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని మామునూరు ఏసీపీ తిరుపతి సూచించారు. గీసుకొండ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. 100కు డయల్ వచ్చిన వెంటనే బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది స్పందించి సంఘటనా స్థలానికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలన్నారు. దొంగతనాలను అరికట్టడానికి పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. గంజాయి, గుట్కా, గుడుంబా విక్రయాలు, సేవనాన్ని అరికట్టాలని చెప్పారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా విలేజీ పోలీస్ ఆఫీసర్ చూడాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారిపై కేసులు నమోదు చేయాలని, ప్రతీ కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
దరఖాస్తుల ఆహ్వానం
వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఈనెల 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి జస్టిస్ ఎం.సాయికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ.నిర్మల గీతాంబ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. స్టెనోగ్రాఫర్ (1), టైపిస్ట్ (1), రికార్డ్ అసిస్టెంట్ (2) పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 23వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా డిస్టిక్ర్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ–వరంగల్, డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్‌కు పంపించాలని తెలిపారు. పూర్తి వివరాలకు వరంగల్ జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. నియామక ప్రక్రియ వివరాలు వరంగల్ జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.
● మామునూరు ఏసీపీ తిరుపతి
● గీసుకొండ పోలీస్‌స్టేషన్ తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment