బిల్లులు రావనే పనులు చేపట్టలేదు..
త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తే అప్పట్లో అభివృద్ధి పనులు చేపట్టాం. ఇప్పటికీ కూడా అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదు. సుమారు రూ.25 లక్షలు రావాల్సి ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.20 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవనాన్ని మంజూరు చేసింది. అధికారులు సకాలంలో బిల్లులు ఇప్పిస్తారనే నమ్మకం లేకనే గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు చేపట్టలేదు. ఈ పనులను గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేకాధికారులు చేపట్టాలి. మా బాధలు అధికారులకు తెలిసే అవకాశం ఉంది.
– గోనె శ్రీదేవి, మాజీ సర్పంచ్, నాగరాజుపల్లి
Comments
Please login to add a commentAdd a comment