నాణ్యమైన భోజనం అందించాలి
అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి
కమలాపూర్: వసతి గృహాల్లో పరిశుభ్రత పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి ఆదేశించారు. కమలాపూర్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, తెలంగాణ మోడల్ స్కూల్, మహాత్మా జ్యోతిబాపూలే బాలికల, బాలుర గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయా పాఠశాలలో భోజనం పరిశీలించారు. కూరలు రుచి చూశారు. ఆయా కార్యక్రమాల్లో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ఎంజేపీ గురుకుల ఆర్సీఓ రాజ్‌కుమార్, తహసీల్దార్ సురేశ్‌కుమార్, కేజీబీవీ ఎస్‌ఓ అర్చన, ప్రిన్సిపాళ్లు డాక్టర్ జి.అనిత, సౌజన్య, డాక్టర్ టి.రవీందర్ పాల్గొన్నారు.
ప్రతీ గింజను ప్రభుత్వమే కొంటుంది..
రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొంటుందని అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గూడూరులోని పీఏసీఎస్, కమలాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దేశరాజుపల్లికి చెందిన పలువురు రైతులు తాము కానిపర్తి మిల్లుకు ఇచ్చిన ధాన్యం డబ్బులు ఇంకా రాలేదని, వెంటనే ఇప్పించాలని వినతిపత్రం ఇచ్చారు. ఆయన వెంట తహసీల్దార్ సురేశ్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ సంపత్‌రావు, సీఈఓ చోటేమియా, ఏపీఎం నారాయణ, సీసీ మౌనిక, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment