మేడారం అడవులు కేంద్రంగా భూ ప్రకంపనలు
గురువారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
– 8లోu
ములుగు/ఏటూరునాగారం/ఎస్‌ఎస్ తాడ్వాయి/నెట్‌వర్క్:
ములుగు జిల్లా మేడారం కేంద్రంగా ఏర్పడిన భూ ప్రకంపనలు ఉమ్మడి జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. భూమి కంపించిన సమయంలో కొన్నిచోట్ల వంట పాత్రలు కింద పడిపోగా.. ఇంటి తలుపులు తెరుచుకోవడం, సీలింగ్ ఫ్యాన్లు అటోమేటిక్‌గా ఊగడం, ముఖద్వారం గేటు సమీపంలో శబ్దాలు రావడంతో ఇళ్లలోనుంచి ఉరుకులు, పరుగులు పెట్టారు. అటవీ ప్రాంతాల దగ్గర ఉన్న గ్రామాల్లో సాధారణంగా కోతుల బెదడ కారణంగా ఇంటి పైకప్పులు, కిటికీల శబ్దం అని మొదట అనుకున్నా అప్పటికే సోషల్ మీడియాలో భూ ప్రకంపనలు వార్తలు చూసిన ప్రజలు ఇళ్లనుంచి బయటికి పరుగులుతీశారు. కొంత మందికి ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు.
ఇసుక, బొగ్గు..
వేడినీళ్ల స్థావరాల్లోనే
రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదు
ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని మేడారం సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 40కిలోమీటర్ల లోతు నుంచి భూమి కంపించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్‌సీఎస్) వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై 5.3 మాగ్నిట్యూడ్‌గా నమోదైనట్లు నిర్ధారించింది. మేడారం సమీపంలోని ఉత్తరభాగం మీదుగా రెండు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వ్యాపించాయి. ఉదయం 7.27నుంచి 7.29గంటల వరకు 3 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది.
న్యూస్‌రీల్
కంపించిన అమ్మవారి గద్దెలు
Comments
Please login to add a commentAdd a comment