‘న్యాస్’ ప్రశాంతం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని 83 పాఠశాలల్లో నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేను బుధవారం నిర్వహించారు. ఈసర్వేను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు పాఠశాలలకు వెళ్లి నిర్వహించారు. జిల్లాలో మొత్తం 2,322 మంది విద్యార్థులు న్యాస్ సర్వే (పరీక్ష)కు హాజరయ్యారు. డీఈఓ వాసంతి పర్యవేక్షించారు.
న్యాస్ పరీక్షకు 2373 మంది హాజరు
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో బుధవారం నిర్వహించిన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (న్యాస్) పరీక్ష కు 2,373 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈ ఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. 105 పాఠశాలల నుంచి 3, 6,9 తరగతుల విద్యార్థులు హాజరుకాగా..353 మంది ఉపాధ్యాయులు పర్యవేక్షించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment