ఓపీ సేవలు మెరుగు
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే వేలాది మంది రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు పరిపాలనాధికారులు, కలెక్టర్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఆస్పత్రిని దశల వారీగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. మొదటి దశలో మెరుగైన ఓపీ సేవల కోసం నూతన కంప్యూటర్ కౌంటర్లు, ఫార్మసీ కౌంటర్లు పెంచారు. రోగుల కోసం ప్రతి ఓపీ గది వద్ద కు ర్చీలు వేయించారు. రిపీట్ ఓపీ కోసం ఓపీ షెడ్డులో ప్రత్యేక గదిని అందుబాటులోకి తేవడంతో రోగుల సహాయకులు సేద తీరేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఓపీ కౌంటర్ల వద్ద తగ్గనున్న రద్దీ..
ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో ఓపీ గదుల వద్దనే కంప్యూటర్ కౌంటర్లను ఏర్పాటు చేయడంతో రద్దీ ఏర్పడి రోగులు వైద్యసేవలు పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని గమనించిన కలెక్టర్.. ఎంజీఎం పరిపాలనాధికారులతో చర్చలు జరిపి ఓపీ ఎదుట ఉన్న షెడ్డులో పాత కంప్యూటర్ కౌంటర్లకు మరమ్మతులు చేయించారు. రోగులకు నూతన కౌంటర్ల ద్వారా ఓపీ స్లిప్పులను ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నూతన కౌంటర్లు అందుబాటులోకి వస్తే ఓపీ వద్ద రద్దీ తగ్గి రోగులకు మెరుగైన సేవలు అందనున్నాయి.
10 ఫార్మసీ కౌంటర్లు..
ఆస్పత్రిలో ప్రతిరోజూ ఓపీ విభాగంలో సుమారు 3 వేల మంది వైద్య సేవలు పొందుతారు. వీరందరికి కొన్నేళ్లుగా నాలుగు కౌంటర్ల ద్వారా మాత్రమే ఔషధాలు పంపిణీ చేసేవారు. వైద్యుడి వద్ద చికిత్స పొందడం ఒక్క ఎత్తయితే.. ఫార్మసీ కౌంటర్‌లో మందులు పొందడం కోసం కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఒక్కో కౌంటర్ వద్ద ఒక్కో ఫార్మసిస్ట్ సుమారు 500 మంది రోగులకు మందులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో రోగులు గంటల కొద్ది సమయం వేచి చూసేవారు. ప్రస్తుతం కౌంటర్ల సంఖ్యను 10కి పెంచారు. ఇప్పుడు ఒక్కో కౌంటర్‌లో 250 మంది రోగులకు మందులు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. త్వరగా వైద్యసేవలు పొందే అవకాశం ఉంటుంది.
నేడు నూతన కౌంటర్లు ప్రారంభం..
ఓపీ రోగుల కోసం ఏర్పాటు చేసిన నూతన కంప్యూటర్ కౌంటర్లు, ఫార్మసీ కౌంటర్లను కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు గురువారం ప్రారంభించనునట్లు ఎంజీఎం పరిపాలనాధికారులు తెలిపారు. నూతన కౌంటర్లు అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన సేవలు అందనున్నట్లు వారు పేర్కొన్నారు.
ఎంజీఎంలో నూతనంగా కంప్యూటర్ కౌంటర్లు
ఔషధాల పంపిణీకి
10 ఫార్మసీ కౌంటర్లు
రిపీట్ ఓపీ కోసం ఆస్పత్రిలో
ప్రత్యేక గది ఏర్పాటు
నేడు ప్రారంభించనున్న కలెక్టర్, ప్రజాప్రతినిధులు
Comments
Please login to add a commentAdd a comment