హిందువులపై దాడులు హేయం
హిందుధర్మ పరిరక్షణ సమితి
ఆధ్వర్యంలో ర్యాలీ
హన్మకొండ కల్చరల్ / విద్యారణ్యపురి: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, ఇస్కాన్ స్వామి చిన్మయ కృష్ణదాస్ అరెస్ట్ట్కు నిరసనగా హిందుధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హనుమకొండలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. హనుమకొండలోని వేయి స్తంభాల గుడి నుంచి ప్రారంభమైన ర్యాలీ పెట్రోల్ పంపు అంబేడ్కర్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లోని హిందువులపై కొంతకాలంగా అక్కడి ప్రభుత్వం అనేక రకాల దాడులు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాలీలో ఇస్కాన్ సంస్థ ప్రతినిధి భూపాన్వన్ హరినామ్ దాస్, సమితి బాధ్యులు శివరాములు, వెలగందుల రాజు, డాక్టర్ మంద శ్రీనివాస్, జూలపెల్లి కరుణాకర్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాతంగి రమేష్‌బాబు, అయ్యప్ప సేవా సమితి, హనుమాన్ సేవా సమితి, మార్వాడీ సేవాసమితి, పతంజలి సంస్థ బాధ్యులు హిందూ ధార్మిక సంస్థలు, దేవాలయ కమిటీలు, హరిహర క్షేత్రం బాధ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment