● వీసీలో రాష్ట్ర మంత్రులు
హన్మకొండ/వరంగల్ : అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. శనివారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి వారు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. జాబితాలో పేర్లు రాని వారు 21వ తేదీన జరిగే గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీసీలో వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, హనుమ కొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీసీఎస్‌ఓ కొమురయ్య,కౌసల్యదేవి,అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment