20 ఏళ్ల.. ‘వర్షం’
ఇరవై ఏళ్ల క్రితం వరంగల్ ప్రాంతంలో చిత్రీకరించిన వర్షం సినిమా రెండు రాష్ట్రాల్లో 200 రోజులు ఆడి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో హీరో ప్రభాస్, హీరోయిన్ త్రిషపై పలు సన్నివేశాలు కోటలో చిత్రీకరించారు. ఆతర్వాత వందలాది తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, సీరియల్స్‌ను ఖిలావరంగల్ ప్రాంతంలో చిత్రీకరించారు. రాణిరుద్రమాదేవి సినిమాను సైతం కొంత భాగం ఇక్కడే తెరకెక్కించారు. వరంగల్ గడ్డపై పుట్టిన దర్శకులు, నటులు జైనీ ప్రభాకర్, కరాటే ప్రభాకర్, సంగ కుమార్, గడ్డం సుధాకర్, గణేశ్ ఈ ప్రాంత వైభవాన్ని చాటుతూ.. అనేక చిత్రాలు నిర్మించారు. ‘నేనే సరోజన’ సినిమాను పాకల శారద, సదానందం రచయిత, నిర్మాతగా ఈపరిసరాల్లో షూట్ చేశారు. గతేడాది డిసెంబర్‌లో ‘ఓ రామా, అయ్యోరామ’ సినిమా షూటింగ్.. జరిపారు. సుహాస్, మాళవిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి పలు సన్నివేశాలు కోటలో చిత్రీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment