ఖిలావరంగల్ కోట అందాల్లో పలు సినిమాల చిత్రీకరణ
ఇక్కడేముందంటే..
ఉమ్మడి జిల్లాలో సినీ చిత్రీకరణకు ఎన్నో అనువైన ప్రదేశాలున్నప్పటికీ ఖిలావరంగల్ కోటను ప్రథమంగా చెప్పుకోవాలి. ఇక్కడి ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. రాతి శిల్పాలైతే చూపు తిప్పనివ్వవు. పురాతన కట్టడాలు, రాజ ప్రాకారాలు, కోటలు, రాజులు వినియోగించిన ఖుష్ మహల్, ఏకశిల కొండ ఇవన్నీ మైమరిచిపోయేలా చేస్తాయి. కనువిందు చేసే ఏకశిల కొండ, విశాలమైన జలాశయం, బోటు షికారు, చుట్టూ పచ్చని సిరుల పంటలు. పల్లెటూరి వాతావరణం.. వెరసి ప్రకృతి రమణీయతకు ఇక్కడి ప్రాంతం పెట్టింది పేరుగా చెప్పవచ్చు. టూరిజం స్పాట్‌గా వెలుగొందుతున్న ఈప్రాంతంపై పాలకులు దృష్టి సారిస్తే టాలీవుడ్‌లో హైదరాబాద్ తర్వాత ఇక్కడే ఎక్కువ షూటింగ్‌లు జరిగే అవకాశం ఉంది. వైభవానికి పెట్టింది పేరు.. కాకతీయుల రాజధాని చుట్టూ 7 కిలోమీటర్లు మట్టి కోట, 4.5 కిలోమీటర్ల పరిధిలో రాతికోట విస్తరించి ఉంటుంది. రాతికోట చుట్టూ ఉన్న నాలుగు దర్వాజలను (1 బండి దర్వాజ, 2, మచ్లీ, 3వ సీనా, 4వ హైదర్) పేర్లతో పిలుస్తారు. 75 బురుజులతో, నల్లరాతితో నిర్మించిన ఈకోట వైభవానికి పెట్టింది పేరుగా చెప్పవచ్చు. ఈ ద్వారాల వద్ద అనేక సినిమాలను చిత్రీకరించారు. లఘు చిత్రాల షూటింగ్‌లైతే లెక్కేలేదు.
Comments
Please login to add a commentAdd a comment