వీరభద్ర శరభ..శరభ
ఎల్కతుర్తి : కోనేటిలో స్నానాలు ఆచరించిన భక్తులు అగ్నిగుండాన్ని దాటుతూ వీరభద్ర శరభ..శరభ..అంటూ స్వామివారి నామాన్ని స్మరించారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం వేకువజామున అగ్నిగుండం నిర్వహణ అనంతరం సాయంత్రం స్వామివారి గ్రామపర్యటనతో వేడుకలు ముగిశాయి. ఆలయంలో భంగిమటం పరమేశ్వరయ్య పూజలు చేసిన తర్వాత అగ్నిగుండం కార్యక్రమం నిర్వహించారు. అగ్నిగుండాలపై నడిచిన భక్తుల దోషాలు తొలగి విముక్తి పొందుతారని అర్చకులు పేర్కొన్నారు. ఆలయ ఈఓ కిషన్‌రావు, చైర్మన్ చంద్రశేఖర్‌గుప్తా, సీఐ పులి రమేష్, ఎస్సై సాయిబాబు, పలువురు అర్చకులు, ధర్మకర్తలు అధితర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అగ్నిగుండంపై నడిచి భక్తిని చాటుకున్నారు. భద్రకాళి సమేత వీరభద్రుడికి భక్తులు నారికేళాలు సమర్పించి మంగళహారతులతో మొక్కులు చెల్లించుకున్నా రు. అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
కొత్తకొండలో అగ్నిగుండం నిర్వహణ
స్వామివారి గ్రామపర్యటనతో
ముగిసిన బ్రహ్మోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment