గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: ఐదో తరగతి నుంచి ఎనిమిదో తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్, హనుమకొండ జిల్లాల మైనార్టీ సంక్షేమాధికారులు టి.రమేశ్, డి.మురళీధర్‌రెడ్డి శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. మైనార్టీల కోటాలో ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ అడ్మిషన్, నాన్ మైనార్టీ కోటాలో లక్కీడిప్ ద్వారా సీట్ల భర్తీ జరుగుతుందని వారు తెలిపారు. వరంగల్ జిల్లాల్లోని ఐదు మైనార్టీ గురుకులాలు (ఇంగ్లిష్ మీడియం) వరంగల్ బి–1, జక్కలొద్ది, వర్ధన్నపేట బి–1, వరంగల్ జి–1, కేయూ క్రాస్, వరంగల్ జి–2, శంభునిపేట, నర్సంపేట జి–1), హనుమకొండ జిల్లాల్లోని నాలుగు, ఇంగ్లిష్ మీడియం (హనుమకొండ బి–1, హనుమకొండ జి–1, కాజీ పేట బి–1, పరకాల బి–1) 2025–26 విద్యాసంవత్సరానికి అర్హులు tmreis.telangana. gov.inలో వచ్చే నెల 28లోగా సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలకు జిల్లాల పరిధి మైనార్టీ గురుకులాల్లో కానీ ఆయా జిల్లాల మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో కానీ సంప్రదించాలని సూచించారు.
పౌరసేవలకు అంతరాయం
వరంగల్ అర్బన్ : బల్దియా ప్రధాన కార్యాలయంలోని పౌరసేవ కేంద్రంలో ఏర్పడిన ఇంటర్‌నెట్ సాంకేతిక లోపంతో శనివారం పౌరసేవలకు అంతరాయం ఏర్పడింది. వివిధ పనుల నిమిత్తం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన పౌరులు నిరాశతో వెనుదిరిగారు. సాయంత్రం మరమ్మతులు పూర్తయ్యాయని బల్దియా ఐటీ విభాగం నిపుణులు తెలిపారు.
21న సివిల్ సర్వీసెస్
ఉద్యోగులకు క్రీడాపోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 21వ తేదీన సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు జిల్లాస్థాయి క్రీడా ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంటులో అథ్లెటిక్స్, క్రికెట్, చెస్, క్యారమ్స్, హాకీ, స్విమ్మింగ్, టేబుల్ టెన్నీస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, రోమన్, బెస్ట్ ఫిజిక్, ఖోఖో, యోగా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 23, 24వ తేదీల్లో హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో జరిగే రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. పోటీల్లో పాల్గొనే ఉద్యోగులు 21న ఉదయం 10గంటలకు జేఎన్‌ఎస్ ఎదురుగా ఉన్న ఇండోర్ స్టేడియంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు అథ్లెటిక్స్ కోచ్ శ్రీమన్నారాయణ 94410 86556 నంబర్‌లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
నేడు బాలవికాసలో స్టేట్
లెవెల్ యూత్ కన్వెన్షన్
కాజీపేట రూరల్: కాజీపేట ఫాతిమానగర్ బాలవికాస ట్రైనింగ్ సెంటర్‌లో ఆదివారం స్టేట్ లెవెల్ యూత్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర 8 జిల్లాలకు చెందిన అనాథ పిల్లలు, పేద విద్యార్థులకు ఉదయం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్టేట్ లెవెల్ యూత్ కన్వెన్షన్ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం వస్తువుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు.
పార్కింగ్ స్థలం
ఏర్పాటు చేయాలి
హన్మకొండ కల్చరల్ : పర్యాటకులు, భక్తుల రద్దీ దృష్ట్యా వేయిస్తంభాల దేవాలయం ముందు భాగంలో వాహనాల పార్కింగ్ కోసం విశాలమైన స్థలాన్ని ఏర్పాటు చేయాలని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ కోరారు. శనివారం ‘కుడా’ కార్యాలయంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ మధుకర్‌తో కలిసి ఆయన కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డిని కలిసి శాలువాతో సన్మానించి వినతిపత్రం అందజేశారు. దేవాలయాన్ని సందర్శించే విదేశీ టూ రిస్టుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, ఆహ్లా దకరమైన గార్డెన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కుడా చైర్మన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రసాద్ పథకంలో వేయి స్తంభాల దేవాలయాన్ని చేర్చాలని, త్వరలో డీపీఆర్ తయారు చేసి ఎంపీకి అందజేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment