వ్యాధి నిరోధక టీకాలు వేయాలి
ఐనవోలు : గ్రామాల్లో మైక్రో యాక్షన్ ప్లాన్ ప్రకారం వ్యాధి నిరోధక టీకాలు వేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య అధికారులను ఆదేశించారు. కొండపర్తి పీహెచ్‌సీ పరిధిలోని ముల్కలగూడెం, నరసింహులగూడెం, వెంకటాపూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్న ఔట్‌రీచ్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్, ఇతర రికార్డులను పరిశీలించారు. నర్సింహులగూడెంలో 56 మంది బీపీ, 26 మంది డయాబెటిస్, ముల్కలగూడెంలో 144 మంది బీపీ, 63 మంది డయాబెటిస్, వెంకటాపూర్‌లో 181 మంది బీపీ, 117 హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. వీరందరికి ఫాలోఆప్ వైద్యసేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. మూడు గ్రామాల్లో 15 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపారు. పీహెచ్‌సీ పరిధిలో గర్భిణులు, ఇటీవల సర్వేలో గుర్తించిన అనుమానిత లెప్రసీ కేసులు, టీబీ తదితర వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలను వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. డ్యూలిస్టు ప్రకారం వ్యాక్సిన్ వేయాల్సిన వారికి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొండపర్తి వైద్యాధికారి శ్యాంప్రసాద్, సూపర్‌వైజర్ జ్యోతి, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment