గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి
కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: జిల్లాలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వేడుకల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకల్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వైవి.గణేశ్, డీఆర్డీఓ శ్రీను, ఆర్డీఓలు రమేశ్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
గ్రామసభలు పకడ్బందీగా నిర్వహించండి
మంగళవారం నుంచి పకడ్బందీగా గ్రామ సభల్ని నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని ఆర్డీఓలు, నోడల్ ఆధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీలతో గ్రామ సభల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
ఓటరు దినోత్సవాన్ని
ఘనంగా నిర్వహించండి
హన్మకొండ అర్బన్: జిల్లాలో ఈనెల 25న చేపట్టనున్న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఓటర్ల దినోత్సవ ఏర్పాట్లు, వివిధ కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు కె.నారాయణ, రాథోడ్ రమేశ్, జిల్లా ట్రెజరరీ ఆఫీసర్ శ్రీనివాస్‌కుమార్, డీఈఓ వాసంతి, డీఐఈఓ గోపాల్, నెహ్రూ యువ కేంద్ర కో–ఆర్డినేటర్ అన్వేశ్, డీవైఎస్‌ఓ అశోక్‌కుమార్, తహసీల్దార్లు భావుసింగ్, శ్రీపాల్‌రెడ్డి, నాయబ్ త హసీల్దార్లు జన్ను శ్యాంకుమార్, విఠలేశ్వర్ పాల్గొన్నారు.
నేడు కబడ్డీ ఎంపిక పోటీలు
వరంగల్: వరంగల్ జిల్లా పురుషుల (సీనియర్స్) కబడ్డీ ఎంపిక పోటీలను నేడు(మంగళవారం) కాశిబుగ్గలోని ‘ఓ సిటీ’ మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్లాఖాన్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 85 కిలోలలోపు బరువుండాలని, ఈసెలెక్షన్స్‌లో అత్యంత ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేసి, త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో పాల్గొంటారని తెలిపారు. వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు క్రీడాకారులతో సకాలంలో హాజరు కావాలని కోరారు.
ముగ్గురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిషోర్ ఝా సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. వరంగల్‌కు అలాట్ అయిన ఎస్.శ్రీనివాస్‌ను నెక్కొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా, ఇక్కడి ఇన్‌స్పెక్టర్ చంద్రమోహన్ ఎస్‌బీకి, ఎస్‌బీలో ఉన్న ప్రతాప్‌ను మల్టీజోన్‌కు బదిలీ చేశారు.
ఆజాదీకా అమృత్ మహో
త్సవ్ శిక్షణలో నగరవాసి
కాళోజీ సెంటర్: న్యూ ఢిల్లీలో ఈనెల 8 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఎన్‌ఈపీ 2020 ఇన్ సర్వీస్ ట్రైనింగ్‌లో తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 116 మంది ఉపాధ్యాయులకు సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ కొనసాగుతుంది. రాష్ట్రం నుంచి 10 మంది ఉపాధ్యాయులకు అవకాశం లభించగా జిల్లా నుంచి ఖిలావరంగల్ మండలం జెడ్పీహెచ్‌ఎస్ బొల్లికుంట పాఠశాలకు చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు చల్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. సోమవారం తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు, తెలంగాణ చరిత్ర, దేవాలయాలు, బతుకమ్మ, బోనాల పండుగల విశిష్టతను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment