రూ.750 కోట్లతో గ్రామాల అభివృద్ధి
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్: రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రానన్ని నిధులు స్టేషన్ ఘన్‌పూర్‌కు వచ్చాయని.. రూ.750 కోట్ల నిధులతో గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. మండలంలోని పెద్దపెండ్యాలలో రూ.1.75 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు, సైడ్ డ్రెయినేజీ నిర్మాణం, రూ.20 లక్షలతో గౌడ సంఘం కమ్యునిటీ భవన నిర్మాణానికి ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డితో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. పెద్దపెండ్యాల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు, త్వరలో మంజూరు వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్‌కుమార్, స్పెషల్ ఆఫీసర్ అఫ్జల్, నాయకులు తోట నాగరాజు, రాజారపు యాదగిరి, గుర్రపు ప్రసాద్, వల్లపురెడ్డి రాంరెడ్డి, రావుల వెంకట్‌రెడ్డి, రాజ్‌కుమార్, బొడ్డు లెనిన్, సాంబయ్య, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment