అర్హుల ఎంపికలో అలసత్వం వద్దు
● శాయంపేట, పత్తిపాకలో
రేషన్ దరఖాస్తుల పరిశీలన
● కలెక్టర్ ప్రావీణ్య
శాయంపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాల అర్హుల ఎంపికలో అధికారులు అలసత్వం వహించకుండా.. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని శాయంపేట, పత్తిపాకలో ప్రభుత్వ పథకాల కోసం వచ్చిన దరఖాస్తులు, పథకాల అమలుకు కొనసాగుతున్న సర్వేను పరిశీలించారు. శాయంపేట పంచాయతీ నోటీస్ బోర్డుకు అంటించిన నాలుగో విడత రైతు రుణమాఫీ జాబితాను పరిశీలించారు. పత్తిపాక కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భోజనం బాగుంది..
మండలంలోని మాందారిపేట గ్రామ శివారు కస్తూ ర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం బాగుందని వంట నిర్వాహకులను ప్రశంసించారు. అనంతరం విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని స్పెషల్ ఆఫీసర్ మాధవి, ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో డీపీఓ రమాకాంత్, డీడబ్ల్యూఓ, మండల స్పెషల్ ఆఫీసర్ జయంతి, ఆర్డీఓ నారాయణ, పరకాల ఏసీపీ సతీశ్‌బాబు, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ ఫణిచంద్ర, ఎంఈఓ భిక్షపతి, ఏఓ గంగాజమున, ఎంపీఓ రంజిత్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
వేలేరు: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతున్న తీరును అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం నుంచి నిర్వహించే గ్రామసభల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, ఏఓ కవితారాణి, ఎంపీఓ విమల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment