సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్: అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రేటర్ పరిధి 16వ డివిజన్ జాన్‌పాక ప్రాంతంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేలో తప్పులు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాస్, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
సభలు పకడ్బందీగా నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి నేటి (మంగళవారం) నుంచి నిర్వహించే గ్రామ, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. అధికారులకు పలు సూచనలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment