![పాలకోడేరు మండలం కొండేపూడిలో 104 వాహనంతో వైద్యులు, సిబ్బంది - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/28/26bvrmprk102-290042_mr_0.jpg.webp?itok=hpGunQ_6)
పాలకోడేరు మండలం కొండేపూడిలో 104 వాహనంతో వైద్యులు, సిబ్బంది
గ్రామాల్లో తిరుగుతూ 104 వాహనాలు వైద్య సేవలందిస్తున్నాయి. వైద్య సిబ్బంది 104 వాహనంలో సంచరిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో ఉండి సేవలు అందిస్తారు. ఈ వాహనాల్లో 30 రకాల వైద్యారోగ్య పరీక్షల కోసం పరికరాలు ఉంటాయి. గ్రామీణ ఆరోగ్యానికి ఈ వాహన సేవలు కీలకం. ప్రతి గ్రామంలో నెలకు రెండు సార్లు విలేజ్ హెల్త్ క్లినిక్‌ల పరిధిలో ఈ వాహనాలు సేవలందిస్తాయి. వాహనాల ద్వారా వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తారు. స్థానిక పీ హెచ్‌సీ వైద్యులు, హెల్త్ సూపర్‌వైజర్లు, ఎం ఎల్‌హెచ్‌పీ, ఆశ వర్కరు, నర్సు సేవలందిస్తారు. 104 వాహనంలో డీఈఓ పైలెట్ కూడా ఉంటారు. ఆరోగ్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు కూడా అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment