భీమవరంలో ర్యాలీ చేస్తున్న విద్యుత్ శాఖ ఓసీ ఉద్యోగులు
భీమవరం: ఎలక్ట్రిసిటీ ఉద్యోగులంతా ఐకమత్యంగా పనిచేయడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని విద్యుత్ శాఖ ఓసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఎలక్ట్రిసిటీ ఓసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం, 2024 డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలు భీమవరంలో బుధవారం ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి రెండు వేల మందికి పైగా ఉద్యోగులు హాజరయ్యారు. కోస్తా, ఉత్తరాంఽధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు స్థానిక యూత్ క్లబ్ ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి భారీ ఎత్తున బాణసంచా కాల్పులు, కేరళ వాయిద్యాలతో వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కరుణాకరెడ్డి మాట్లాడుతూ ఓసీ ఉద్యోగుల సంక్షేమానికి సంఘ సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. సంఘ పటిష్టతకు, సభ్యుల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాల నిర్వహణ కోసం భవిష్యత్ కార్యాచరణపై సభ్యులు చర్చించారు. గజల్ శ్రీనివాస్ ఆలపించిన గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయన ఆలపించిన ఓసీల ఆవేదనా గీతం సీడీని వేదికపై విడుదల చేశారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డి.శ్రీధర్ వర్మ, కె.శ్రీనివాస్, డిస్కం కార్యదర్శి తురగా రామకష్ణ, పులి శ్రీరాములు పాల్గొన్నారు.
శాశ్వత లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలి
ఏలూరు (టూటౌన్): శాశ్వత లోక్‌అదాలత్ సేవలను బ్యాంకులు వినియోగించుకోవాలని శాశ్వత లోక్ అదాలత్ చైర్‌పర్సన్ ఎ.మేరీ గ్రేస్ కుమారి కోరారు. స్థానిక న్యాయసేవాధికార సంస్థ భవన్‌లో బుధవారం బ్యాంకు అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాశ్వత లోక్‌అదాలత్‌లో విద్య, పోస్టల్, బీమా, రియల్ ఎస్టేట్, రవాణా, పారిశుధ్యం, బ్యాంకింగ్, ఉపాధి హామీ, టెలికం సేవలలో లోపంపై విచారణ జరుగుతుందన్నారు. అలాగే వివిధ బ్యాంకుల సేవలను ఉపయోగించుకుని తిరిగి చెల్లించని రాని బాకీలు విపరీతంగా పెరిగిపోయినవన్నారు. అటువంటి రాని బాకీల సత్వర పరిష్కారం కోసం శాశ్వత లోక్ అదాలత్‌ను ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ శాశ్వత లోక్ అదాలత్‌లో ఇచ్చే తీర్పులకు అప్పీలు ఉండదని ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరము లేదన్నారు. సంబంధిత అధికారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
పాడి రైతులకు ఇతోధిక సేవలు
పెంటపాడు: జిల్లాలో పాడి పరిశ్రమాభివృద్ధితో పాటు పాడి రైతులకు ఇతోధిక సేవలందించేందుకు పాటుపడతానని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పసల కనకసుందరావు అన్నారు. తనకు పదవి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 12 మంది పాలకవర్గ సభ్యులుగా, మరో ముగ్గురిని నామినేటెడ్ సభ్యులుగా ఎన్నుకున్నట్టు చెప్పారు. పల్లెం అరుణకుమారి (సిద్దాపురం, ఆకివీడు), మటపర్తి వరలక్ష్మి (వైఎస్ పాలెం, నరసాపురం), కాకులపాటి మల్లేశ్వరి (తోగుమ్మి, కొవ్వూరు), శింగవరపు కుమారి (అర్జావారిగూడెం, భీమడోలు), కురుసం బేబి (గార్లగొయ్యి, పోలవరం), గంటా సుందర్‌కుమార్ (భీమవరం), మరీదు భాలస్వామి (భోగాపురం, పెదవేగి), షేక్ రహీం (సమిశ్రగూడెం, నిడదవోలు), గేదల సూర్యప్రకాష్‌రావు (పోణంగి, ఏలూరు), పెనుమత్స వెంకట సత్యసూర్యనారాయణరాజు, (జిన్నూరు, పోడూరు), గుంటూరు పెద్దిరాజు(కొమ్ముచిక్కాల, పోడూరు), వెలగల అమ్మిరెడ్డి (ఆరవల్లి, అత్తిలి), డాక్టర్ జి.కుమార్‌రాజా (భీమవరం), ఎస్.ఏసుదాసు (భీమవరం), ఎం.విజయ్‌కుమార్ (జంగారెడ్డిగూడెం) ఎన్నికయ్యారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment