ముసునూరు: మహా శివరాత్రి సందర్భంగా పిభ్రవరి 24 నుంచి 28 వరకు బలివేలోని బలేరామలింగేశ్వరస్వామి దేవస్థానంలో జరుగనన్ను మహోత్సవాల్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈనెల 11న శనివారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పామర్తి సీతారామయ్య తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకర్లకు వివరాలను వెల్లడించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 3 రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయని, ఉత్సవ ప్రాంగణంలో వ్యాపారాలు నిర్వహించుకునుటకు అవసరమైన తాత్కాలిక దుకాణ సముదాయాల ఏర్పాటు, నాలుగు రోజులపాటు కొబ్బరి చిప్పల సేకరణకు ఈ వేలం నిర్వహిస్తామన్నారు. వేలంలో పాల్గొనుటకు ఆసక్తిగలవారు దుకాణ స్థలాల కోసం రూ.50 వేలు, కొబ్బరి చిప్పల సేకరణదారులు రూ.20 వేలు డిపాజిట్ చెల్లించి, సకాలంలో వేలంకు హాజరు కావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment