ప్రజల పక్షాన పోరాడతా
మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం: గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటే చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలను నిండా ముంచారని మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విమర్శించారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ఆయన నివాసం వద్ద మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలతో గత ఏడు నెలలుగా చంద్రబాబు దుర్మార్గ పాలన చేస్తు డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకుండా గాలికి వదిలేశారన్నారు. ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment