అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలి
నరసాపురం: నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. బుధవారం పట్టణంలోని గోదారి రేవు వద్ద ఉన్న ముదునూరి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముదునూరి ఉదయం నుంచి ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలోని నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ముదునూరి నివాసానికి చేరుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ముదునూరి మాట్లాడుతూ ప్రజలు కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయాలని సూచించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా నిలబడుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment