క్రాంతికుమార్ మృతదేహం
నిడమర్రు: కుటుంబంలో గొడవలతో మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఓ ఏసీ మెకానిక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన అయితం క్రాంతికుమార్ (28) నిడమర్రు మండలం తోకలపల్లికి చెందిన గంగారత్నంతో 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా క్రాంతికుమార్ చెడు అలవాట్లకు బానిసై భార్యను కొడుతుండటంతో పెద్దల్లో మధ్య రాజీ చేసినా అతనిలో మార్పు రాలేదు. దీంతో భార్య గత నెల 29న పుట్టింటికి వెళ్లి నిడమర్రు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మంగళవారం పిల్లలను చూసేందుకు నిడమర్రు వచ్చిన క్రాంతికుమార్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతనిని 108లో తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై ఆర్ శ్రీను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment