రోడ్డు ప్రమాదంలో బోల్తా కొట్టిన ఆటో
ఐదుగురు హిజ్రాలకు గాయాలు
తణుకు: తేతలి గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు హిజ్రాలు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లిగూడెంకు చెందిన హిజ్రాలు ఆటోలో ఉండ్రాజవరం మండలం వడ్లూరు వెళుతుండగా తేతలి గ్రామంలో ఓ కారు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. కారు వేగం ధాటికి ఆటో పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న హిజ్రాలు ప్రియాంక, సోనాలి, నందిని, అరుణ, గాయత్రి గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని తణుకు రూరల్ పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment