క్రీస్తు మార్గం అనుసరించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఏసు క్రీస్తు ప్రేమ, దయ, గుణాలు ప్రజలందరి జీవితాలకు మార్గదర్శకమని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఆదివారం జిల్లా క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఆదివారం విష్ణు కాలేజీ మిని ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ క్రీస్తు మార్గం అనుసరణీయమన్నారు. ప్రజల కొరకు ఆయన ప్రాణత్యాగం చేశారని, ప్రపంచ దేశాలన్నీ ఆయనను అనుకరిస్తున్నాయన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మానవుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటు అందించాలన్నారు. జిల్లా ఎస్పీ సతీమణి హీనా, కుమారుడు హంజహ్ తదితరులు క్రిస్మస్ కేకు కట్ చేశారు. ఫాదర్ స్టాలిన్, రెవరెండ్ ప్రతాప్ వాక్య సందేశాన్ని ఇచ్చారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు క్రైస్తవ గీతాలు పాడి వినిపించారు. కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎన్‌ఎస్ కృపావరం, మైనార్టీ వెల్ఫేర్ అధికారి శేషుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment