క్షీరారామంలో కనుమ ఉత్సవం
పాలకొల్లు అర్బన్: పంచారామ క్షేత్రం పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం (క్షీరారామం)లో కనుమ ఉత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ గోశాలలో గోవులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చే శారు. అలాగే గ్రామోత్సవం నేత్రపర్వంగా సా గింది. ఆలయ అర్చకస్వామి కృష్టప్ప, దేవ స్థానం సూపరింటెండెంట్ వాసు, అర్చకులు, ఆలయ సిబ్బంది సేవలందించారు.
రసవత్తరంగా చెడుగుడు పోటీలు
ఆకివీడు: రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు బుధవారం స్థానిక జెడ్పీ హైస్కూల్ ఆవరణలో ప్రారంభమయ్యాయి. డీవైఎఫ్‌ఐ సంక్రాంతి పోటీల్లో భాగంగా చెడుగుడు పోటీలు, రెండు జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించేందుకు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు 42 ఏళ్లుగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్న ట్టు డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గేదెల ధనుష్ తెలిపారు.
ముగిసిన పొట్టేలు పోటీలు
కై కలూరు: సంక్రాంతి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలస్థాయి పొట్టేలు పోటీలు బుధవారం ముగిశాయి. మండవల్లి మండలం చావలిపాడు గ్రామంలో తలారి వెంకటస్వామి సోదరులు, తెలంగాణలో స్థిరపడిన ఈ ప్రాంతవాసి నీలపాల నరేష్ యాదవ్‌ల ఆధ్వర్యంలో భోగి రోజున ప్రారంభించి పోటీల్లో 150 పొ ట్టేళ్లు తలపడ్డాయి. తెలంగాణలోని బోయినపల్లికి చెందిన అబీద్ పొట్టేలు విజేతగా నిలిచి రూ.లక్ష నగదు బహుమతి గెలుచుకుంది. విజేతలకు సినీ నటి అప్సరా రాణి బహుమతులు అందించారు.
నేడు డీఆర్సీ సమావేశం
ఏలూరు (మెట్రో): జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశాన్ని గురువారం ని ర్వహించనున్నారు. కలెక్టరేట్‌లో ఉదయం 11 గంటల నుంచి జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment