● కొత్త అల్లుడికి అదిరే ఆతిథ్యం
జంగారెడ్డిగూడెం : గోదారోళ్ల ప్రేమాభిమానులకు ప్రత్యేకత ఉంది. ఆతిథ్యంలో వీరికి వీరే సాటి. సంక్రాంతి కొత్త అల్లుడికి 452 రకాల వంటకాలతో అదిరే ఆతిథ్యం ఏర్పాటుచేసి ఔరా అనిపించారు. జంగారెడ్డిగూడేనికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు వందనపు వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ దంపతుల కుమార్తె ప్రియాంకకు కొయ్యలగూడేనికి చెందిన కొల్లూరు శివభాస్కర్‌కు ఇచ్చి గతేడాది వివాహం చేశారు. ఇది తొలి సంక్రాంతి కావడంతో అల్లుడికి ఇలా భారీ విందు ఏర్పాటుచేశారు. పిండి వంటలు, రైస్ వంటలు, కూరలు, పచ్చళ్లు, పొడులు, పండ్లు, సూప్స్, బిర్యానీలు, సేమియా ఐటమ్స్, స్వీట్లు వంటివి విందులో ఉంచారు. విందు భోజనాన్ని తిలకించేందుకు బంధువులు, మిత్రులు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment